Bigg Boss 9

Bigg Boss 9 : బిగ్‌బాస్ 9 హోస్ట్‌గా బాలయ్య సంచలన ఎంట్రీ?

Bigg Boss 9: తెలుగు రియాలిటీ షోల్లో సంచలనం సృష్టించే ‘బిగ్‌బాస్’ తొమ్మిదో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈసారి షోకు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షోతో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించిన బాలయ్య, బిగ్‌బాస్‌కు కొత్త ఊపు తీసుకొస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఆయన ఎనర్జీ, స్వాగ్, హాస్యం షోను మరో స్థాయికి తీసుకెళ్తాయని చర్చలు జరుగుతున్నాయి.

గత ఎనిమిది సీజన్లలో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, ఈసారి కొత్త రుచి కోసం నిర్వాహకులు బాలయ్యను ఎంచుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘అఖండ 2’ సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య, ఈ ఆఫర్‌ను ఒప్పుకుంటారా లేదా అనేది ఇంకా ధృవీకరణ కాలేదు.

Also Read: Lawrence: చెదలు తిన్న డబ్బు… లారెన్స్ చాటిన గొప్ప మనసు!

ఒకవేళ బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే, షోలో సినిమా, సోషల్ మీడియా స్టార్లతో పాటు బాలయ్య మార్క్ హంగామా కనిపించనుంది. జులై లేదా సెప్టెంబర్‌లో షో ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాక్. బాలయ్య స్వాగ్‌తో బిగ్‌బాస్ 9 ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: అంబులెన్స్ డ్రైవర్ మిస్సింగ్..అతి పెద్ద కుట్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *