Daaku Maharaaj

Daaku Maharaaj: బాలకృష్ణ బ్లాక్‌బస్టర్‌ “డాకు మహారాజ్” ఓటీటీలోకి

Daaku Maharaaj: నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన ‘డాకు మహారాజ్’ చిత్రం జనవరి 12, 2025న విడుదలై, బాక్సాఫీస్ వద్ద విశేష విజయాన్ని సాధించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాబీ డియోల్, రవి కిషన్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. విజయ్ కార్తీక్ ఛాయాగ్రహణం, ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు.

Also Read: HIV Injection: కట్నం తేవడం లేదని దారుణం..కోడలికి హెచ్‌ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన అత్తమామల

ఈ చిత్రం ఫిబ్రవరి 21, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్‌గా విడుదల కానుంది. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించిన తమన్ సంగీతానికి ప్రశంసలు అందుకుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *