Balakrishna: అమరావతిలో నిర్మించనున్న బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి ఈ నెల 13న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమిపూజ చేయనున్నారు. ఈ కీలక కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ స్వయంగా పర్యవేక్షించారు.
ఈరోజు బాలకృష్ణ గారు భూమిపూజ జరగనున్న స్థలాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లోపాలు లేకుండా, కార్యక్రమం విజయవంతం అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు, నిర్వాహకులకు బాలకృష్ణ సూచించారు. క్యాన్సర్ రోగులకు మంచి వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఆసుపత్రిని కడుతున్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

