Tejaswini Nandamuri

Tejaswini Nandamuri: సిఎం సహాయనిధికి రూ.50 లక్షలు విరాళంగా అందించిన బాలకృష్ణ కూతురు తేజస్విని

Tejaswini Nandamuri: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి సినీ నటుడు, ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని రూ.50 లక్షల విరాళం అందించారు. శనివారం ఆమె జూబ్లీహిల్స్‌లోని సీఎం అధికారిక నివాసానికి వెళ్లి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రూ.50 లక్షల చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు.

తెలంగాణాలో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల వాళ్ళ త్రీవ్ర నష్ఠాలను చూసింది. వరదలతో అనేక జిల్లాలు నీట మునిగిపోయి, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. వచ్చిన భారీ వర్షాలతో పంటలు లో నీళ్లలో మునిగిపోయాయి. దింతో రైతులు కష్టాల్లో కూరుకుపోయారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రానికి దాదాపు ₹5,400 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది అని అంచనా వేస్తున్నారు. 

మౌలిక వసతుల నష్టం

  • రోడ్లు, వంతెనలు, భవనాలు: ₹2,300 కోట్లకు పైగా నష్టం వచ్చింది. 

  • మునిసిపల్‌ ప్రాంతాలు: ₹1,100 కోట్లు వరకు నష్టం. 

  • జలవనరులు, చెరువులు, ఇరిగేషన్‌ వ్యవస్థలు: ₹629 కోట్లు

  • విద్యుత్‌ సదుపాయాలు: ₹175 కోట్లు

  • పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి: ₹170 కోట్లు

  • ఆరోగ్యం, పశుసంవర్ధక రంగాలకు కూడా గణనీయమైన నష్టం వాటిల్లింది.

వ్యవసాయ రంగం నష్టపోయింది

తెలంగాణా వర్షాల దెబ్బకు సుమారు 4 లక్షల ఎకరాల పంటలు పూర్తిగా నష్టపోయాయి. బియ్యం, పత్తి, మక్కజొన్న ప్రధానంగా నష్టపోయిన పంటలు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 20 లక్షల ఎకరాలకు పైగా పంటలు ప్రభావితమయ్యాయని అధికారులు చెబుతున్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు, నీటి సమస్యలతో మరోసారి ఆర్థిక భారం మోసే పరిస్థితి తలెత్తింది తెలంగాణాలో. 

ప్రాణ నష్టం

వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 

జిల్లాల వారీగా పరిస్థితి

  • ఖమ్మం జిల్లా: మునేరులో వరదల వల్ల భారీగా పంటలు, పశుసంపద, ఇళ్లు దెబ్బతిన్నాయి. అంచనా నష్టం దాదాపు ₹700 కోట్లకు పైగా ఉంది.

  • నిర్మల్‌, కామారెడ్డి, మడేక్‌ జిల్లాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ప్రభుత్వ చర్యలు

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పరిస్థితిని సమీక్షిస్తూ, కేంద్రానికి సహాయ నిధుల కోసం నివేదిక పంపించారు. ఇప్పటికే ₹5,000 కోట్లకుపైగా సాయం కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి కేంద్రాన్ని సంప్రదించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *