Balakrishna: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమగ్ర పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించారు. గత పాలకులు ఆస్పత్రిని పట్టించుకోలేదని గమనించిన బాలకృష్ణ, దీన్ని పూర్వ వైభవానికి తిరిగి తీసుకురామనని హామీ ఇచ్చారు.
ఆస్పత్రిలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కొరత సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అలాగే, హిందూపురానికి కొత్త పరిశ్రమలు స్థాపించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ సిటీ ముఖ్యమైనవి. స్థానిక యువతకే ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, పరిశ్రమల ఏర్పాటుకు రైతుల నుంచి భూములు సేకరించడంలో గిట్టుబాటు, న్యాయమైన ధర ఇవ్వడం ద్వారా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.రైతులు ఆందోళన చెందొద్దని, వారికి న్యాయం చేస్తామని బాలకృష్ణ తెలిపారు.