Bahubali

Bahubali: కొత్త ట్విస్ట్‌తో బాహుబలి రీ-రిలీజ్!

Bahubali: ప్రభాస్, రాజమౌళి కలయికలో వచ్చిన బాహుబలి సినిమా భారతీయ సినిమా చరిత్రలో మైలురాయి. పాన్ ఇండియా సినిమాకు నీళ్లు పోసిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు ఈ ఐకానిక్ ఫ్రాంచైజ్ మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. అక్టోబర్‌లో మొదటి భాగం రీ-రిలీజ్ అని మొదట అనౌన్స్ చేసిన మేకర్స్.. ఇప్పుడు అభిమానులకు మరో ఆశ్చర్యం అందించబోతున్నారు.

Also Read: Akhil Akkineni: అఖిల్‌ పెళ్లి వేడుక ఘనంగా.. సందడి చేసిన సెలబ్రిటీలు

Bahubali: లేటెస్ట్ బజ్ ప్రకారం, ఒకే రోజు బాహుబలి 1, 2 రెండూ థియేటర్లలో విడుదల కానున్నాయట! అంతేకాదు, రెండు భాగాలను ట్రిమ్ చేసి ఒకే సినిమాగా మార్చి, సరికొత్త వెర్షన్‌గా అక్టోబర్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్. ఈ కొత్త ట్రీట్ అభిమానులను థ్రిల్ చేయడం ఖాయం. ఈ రీ-రిలీజ్ ప్లాన్‌పై త్వరలోనే మరింత క్లారిటీ రానుంది. బాహుబలి ఫీవర్ మళ్లీ థియేటర్లలో రగిలించడానికి సిద్ధం అయ్యింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *