Urvashi Rautela: వెండితెరపై గ్లామర్‌తో ఆకట్టుకునే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి, ఆఫ్ స్క్రీన్‌లో తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “నార్త్ ఇండియాలో నా పేరిట బద్రీనాథ్ ఆలయం పక్కన ఊర్వశి టెంపుల్ ఉంది. అది నాకోసం కట్టారు. టాలీవుడ్‌లో చిరంజీవితో ఎంట్రీ ఇచ్చి, వరుసగా స్టార్ హీరోల సినిమాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాను. సౌత్‌లోనూ నా ఫ్యాన్స్ నా పేరిట గుడి కట్టాలని కోరుకుంటున్నా” అని ఊర్వశి పేర్కొంది. ఈ వ్యాఖ్యలు నెటిజన్లలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. గతంలో కియారా అద్వాణీ సినిమా ఫ్లాప్ అయిందంటూ ఆమె చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదమయ్యాయి. ఈ వివాదం ఊర్వశి ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపనుంది? ఇది టాలీవుడ్‌లో ఆమె భవిష్యత్తును ప్రభావితం చేస్తుందా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది.
