YEH GANGSTAR NAHI - GOD

YEH GANGSTAR NAHI – GOD: పవన్‌ – లోకేష్‌ల మైత్రి, ఓ కనువిప్పు, ఓ పాఠం..!

YEH GANGSTAR NAHI – GOD: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మధ్య స్నేహబంధం రోజురోజుకూ బలపడుతోందా? సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన శ్రేణులు తరచూ గొడవపడుతున్నా, వైసీపీ ఈ గొడవలను రెచ్చగొట్టి కూటమి పొత్తును విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నా, పవన్-లోకేష్ మైత్రి మాత్రం చెక్కుచెదరటం లేదు. వారి బంధం రాజకీయంగానే కాకుండా, వ్యక్తిగత స్థాయిలోనూ బలంగా నిలుస్తోంది.

తాజాగా, పవన్ నటించిన ‘ఓజీ’ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే అయినా… పవనన్న అభిమానులకు మాత్రం ఒరిజినల్ గాడ్.. అంటూ పవన్‌కు ఓ రేంజ్‌లో హైప్‌ ఇచ్చారు లోకేష్‌. ఓజీ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ విష్‌ చేశారు. ఈ పోస్ట్‌కు పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తూ.. థ్యాంక్‌ఫుల్‌ కామెంట్స్‌తో లోకేష్‌కు రిప్లై ఇస్తున్నారు.

Also Read: Trump-Pak PM Meet: ట్రంప్‌తో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ భేటీ

పవన్-లోకేష్ బంధం ఇదివరకూ కూడా పలు సందర్భాల్లో హైలైట్ అయింది. వైసీపీ హయాంలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు గురైనప్పుడు, పవన్ రాజమండ్రి జైలుకు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. అక్కడి నుంచి టీడీపీతో పొత్తు ప్రకటించి, కూటమి బలోపేతానికి కీలక పాత్ర పోషించారు. ఈ సంక్షోభ సమయంలో పవన్ లోకేష్‌కు అండగా నిలిచారు. ఇక, మంత్రిగాప్రమాణ స్వీకారం రోజు లోకేష్… చంద్రబాబుతో పాటు పవన్‌కూ పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. వద్దని పవన్ వారించినా, లోకేష్ తన గౌరవాన్ని చాటుకున్నారు. పవన్ సినిమాల విడుదల సమయంలోనూ, బహిరంగ సభల్లోనూ.. లోకేష్ ఎప్పుడూ కూడా “పవన్ అన్న” అంటూనే సంబోధిస్తున్నారు. మొత్తానికి అటు సోషల్‌మీడియాలో గొడవపడుతున్న టీడీపీ, జనసేన శ్రేణులకు… ఇటు టీడీపీ, జనసేన పొత్తు విచ్ఛిన్నమవ్వాలని ఇద్దరి మధ్యా చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ సోషల్‌మీడియాకి పవన్‌ – లోకేష్‌ల మైత్రి ఓ కనువిప్పు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *