Venki Leaks Jagan Links: పవర్ బ్రోకర్, ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఏ34 నిందితుడు వెంకటేష్ నాయుడు వైసీపీ హయాంలో పోషించిన పాత్రలు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. వైసీపీ అధికారం కోల్పోయాక.. రూటు మార్చి.. టీడీపీ, బీజేపీ నేతల్నీ కెలికేశాడు వెంకటేష్ నాయుడు. ఆ సంగతి కాసేపు పక్కన పెడితే… తనని లిక్కర్ డాన్‌ని చేసిన బిగ్‌బాస్ కోసం “నాయుడు సెట్టింగ్స్” పేరుతో ఓ కొత్త అవతారం ఎత్తాడు వెంకటేష్ నాయుడు. జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ భారీ సెట్టింగ్స్ వేశాడు. ఆలయాల సెట్టింగ్స్ అయినా, బటన్ నొక్కుడు ప్రోగ్రామైనా.. జగన్ ఏ కార్యక్రమం జరగాలన్నా నాయుడు సెట్టింగ్ వేయాల్సిందే. ఇలా జగన్ కోసమే స్పెషల్ ఆర్ట్ టీమ్‌ని పెట్టుకుని పని చేయుంచుకునే వాడట. అధికారంలో ఉన్నప్పుడు జగన్ దేవాలయాలకు వెళ్ళినట్లు, అక్కడ పూజలు చేసినట్లు వీడియోస్ రిలీజ్ చేసేది వైసీపీ. కానీ వాటిలో చాలా వరకు నిజం దేవాలయాలు కావని, అవన్నీ వెంకటేష్ నాయుడు క్రియేటివిటీతో రూపొందిన సెట్టింగ్స్ అని తెలుస్తోంది. ఈ తాత్కాలిక నిర్మాణాల కోసం సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరితో వెంకటేష్ నాయుడు ఒప్పందం చేసుకున్న విషయం కూడా బయటకొస్తోంది.
Also Read: Donald Trump: రష్యాపై కోపం.. భారత్‌పై ఆగ్రహం: ట్రంప్ బెదిరింపులు
లిక్కర్ ముడుపుల కోసం ఏర్పాటు చేసుకున్న డెన్‌లో వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు లెక్కపెడుతున్న ఓ వీడియో రిలీజ్ అయ్యింది కదా. అది కేవలం ట్రైలర్ మాత్రమే అంటున్నారు. వెంకటేష్ నాయుడు మొబైల్‌ని డీ కోడ్ చేసిన సిట్‌కి కళ్లు బైర్లు కమ్మే సినిమానే కనబడిందట. ఇండస్ట్రీకి చెందిన అనేక మంది ప్రముఖల ఫోటోలు, కాంటాక్ట్స్ పెట్టుకున్న వెంకటేష్ నాయుడుకు అసలు సినిమా వాళ్ళతో లింక్ ఏంటి? అన్న కోణంలోనూ సిట్ దర్యాప్తు చేస్తోందట. ఇప్పటికే మిల్కీ బ్యూటీ తమన్నాతో మనోడు చార్టెడ్ ఫ్లయిట్ వేసుకుని చక్కర్లు కొడుతున్న ఫొటోలు బయటకొచ్చాయి.
వెంకటేష్ నాయుడుతో తమన్నకు పరిచయం ఎలా అయ్యింది? స్పెషల్ ఫ్లైట్‌లో ఎక్కడికి ఇద్దరూ కలిసి వెళ్లినట్లు? లిక్కర్ స్కామ్ నిందితులతో తమన్నాకు ఏం పని? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమన్నాను కూడా సిట్ విచారిస్తుందేమో చూడాలి. అయితే లిక్కర్ నిందితుడితో తమన్నా ఫోటోలు వైరల్ కావడంతో సినిమా ఇండస్ట్రీలో ఆమెపై అనేక రకాల రూమర్స్ స్ర్పెడ్ అవుతున్నాయి. కానీ తమన్నా మాత్రం నోరు విప్పట్లేదు. ఇప్పటికైనా తమన్నా ఆ ఫోటోలపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.