No sympathy for them

No sympathy for them: జగన్‌ రెడ్డి నోటి దూలే కొంప ముంచిందా?

No sympathy for them: వారు ముగ్గురూ కూడా జగన్ కోసం అన్నీ వదిలేసి పని చేసిన వారే. జగన్‌ని మెప్పించడంలో సఫలం అయ్యారు కానీ, అందుకోసం వారు పాల్పడిన అన్యాయాల కారణంగా జైలుకు పోకుండా తప్పించుకోలేకపోయారు. గతంలో వీరు మాట్లాడిన మాటలు, చేసిన చర్యలు, అన్యాయాలు, అక్రమాలు, రాజకీయ కక్షతో పాల్పడిన దాష్టీకాల కారణంగా ప్రజల్లో చులకనయ్యారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ జైల్లో ఉంటే, కొడాలి నాని ఆస్పత్రికి పరిమితం అయ్యారు. ఇక పీఎస్సార్‌ ఆంజనేయులు కూడా జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. కర్మ రిటర్న్‌ అన్నట్లు… ముగ్గురు అనారోగ్యం భారిన పడి అల్లాడుతున్నారు. అయినప్పటికీ వీరిపై ప్రజల్లో ఎలాంటి సానుభూతి లేదు. చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తున్నారు తప్ప, మరొకటి కాదంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు… ఈ ముగ్గురూ వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. జగన్ మెప్పు కోసం అన్యాయాలు, అక్రమాలు, దాష్టీకాలకు పాల్పడిన వీరు, ఇప్పుడు కాలం కాటుకు బలయ్యారు. అయినా, ప్రజల నుండి సానుభూతి లభించని వీరి పరిస్థితి, అధికార దుర్వినియోగం ఎంత ఘోరమైన ఫలితాలకు దారితీస్తుందో స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు గన్నవరం నియోజకవర్గంలో ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా, గొప్ప పలుకుబడితో జనంలో గుర్తింపు తెచ్చుకున్న వల్లభనేని వంశీ, జగన్ సన్నిహితుడిగా మారిన తర్వాత అక్రమాల ఊబిలో చిక్కుకున్నారు. మైనింగ్, భూ కబ్జా కేసులతో పాటు, చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ, 2024 ఎన్నికల్లో దారుణ పరాజయం చవిచూశారు.

ఇప్పుడు జైల్లో రిమాండ్ ఖైదీగా, శ్వాసకోశ సమస్యలతో అల్లాడుతున్నారు. మూడు నెలల్లోనే ఆయన గ్లామర్ కోల్పోయి, గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నారు. వంశీని జైల్లో పరామర్శించేందుకు వచ్చిన జగన్‌.. వంశీ అందగాడు కాబట్టే అరెస్ట్‌ చేశారంటూ పిచ్చి ప్రేలాపనలకు పోయారు. జగన్‌ చేసిన అందగాడు వ్యాఖ్యలతో ఇప్పుడు వంశీకి రావాల్సిన సానుభూతికి గండిపడినట్లయింది. వంశీ ధీనంగా ఉన్న ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ.. సానుభూతి కోసం ప్రయత్నిస్తోంది వైసీపీ. వంశీని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వంలోని నేతలంతా అంతకు అంతా అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెడుతూ.. వంశీ ఫొటోలను షేర్‌ చేస్తోంది. అయితే వైసీపీ పోస్టులకు ప్రజల నుండి వస్తోన్న రెస్పాన్స్‌ వైసీపీని కంగుతినిపించేలా ఉంటోంది. చేసిన పాపాలకు వంశీ అనుభవిస్తున్నాడనీ, తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదనీ వైసీపీ పోస్టుల కింద కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Also Read: Pawan Kalyan Bata: సినిమాకు మించి కిక్కు.. పవన్‌ సూపర్‌ హిట్లు!

No sympathy for them: ఇక కొడాలి నాని పరిస్థితి కూడా ఇదే. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత, అనారోగ్యంతో ముంబైలో గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. అమెరికాకు పారిపోతారనే ప్రచారంతో లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. వైసీపీ నేతల నుండి కూడా ఆయనకు సహకారం లేకపోవడం గమనార్హం. ఆయన అధికార దుర్వినియోగం, వివాదాస్పద వ్యాఖ్యలే ఈ రోజు కొడాలి నానిని ఈ స్థితికి తీసుకొచ్చాయి.

ఇక పీఎస్సార్ ఆంజనేయులు విషయానికొస్తే… సీనియర్‌ ఐపీఎస్ నుండి జైలు ఖైదీగా మారారు. కాదంబరి జత్వానీ కేసు, ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన, అనారోగ్యంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఓ నెల జైలుకెళ్లొస్తే పోలా అంటూ తన సన్నిహితులతో అన్నారంటున్న మాటలు ఆయనలోని బరితెగింపుకు అద్దం పట్టేలా ఉన్నాయని అందరికీ అర్థమైంది. ఇక కాదంబరి జత్వాని కేసులో ఏం జరిగిందో, ఐఏఎస్‌ స్థాయి అధికారులు జగన్‌ మెప్పు కోసం ఎంత హీనంగా ప్రవర్తించారో జనం అర్థం చేసుకున్నారు. ఈ హీనస్‌ క్రైమ్‌కి నాయకత్వం వహించింది పీఎస్సారే కాబట్టి.. సహజంగానే ప్రజలు ఆయనపై సానుభూతి చూపడం లేదు. అధికారంలో ఉండగా విర్రవీగితే, కాలం ఈ విధంగా శిక్షిస్తుందని వీరి కథ స్పష్టం చేస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *