Rajolu YCP KI TDP Shock: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం అంటేనే.. జనసేనకు కంచుకోటగా, వైసీపీకి కోలుకోలేని షాకులిచ్చే నియోజకవర్గంగా గుర్తింపు తెచ్చుకుంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన ఫ్యాన్ హవాలోనూ రాజోలులో మాత్రం వైసీపీకి షాకిస్తూ జనసేన జెండా ఎగరవేసింది. ఇక 2024లో మరోసారి వైసీపీకి రాజోలులో కోలుకోలేని దెబ్బే తగిలింది. ఇప్పుడా నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికర మలుపు తిరిగింది. రాజోలు వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌గా గొల్లపల్లి సూర్యారావు ఉండగా, ఆయన కుమార్తె అమూల్యను ఇంచార్జ్‌గా నియమించింది టీడీపీ.తండ్రీకూతుళ్లు వేర్వేరు పార్టీల నుంచి రాజోలులో రాజకీయంగా నిలవడం రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తే.. వైసీపీకి మాత్రం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
Also Read: Peddareddy Big Mistake: పెద్దారెడ్డి ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండాల్సిందా?
గొల్లపల్లి సూర్యారావు రాజకీయ చరిత్ర సుదీర్ఘమైనది. 1989లో అల్లవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్ నుంచి అల్లవరం ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2014లో టీడీపీలో చేరి రాజోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఓడిపోయిన ఆయన, 2024లో వైసీపీలో చేరి రాజోలు నుంచి పోటీ చేసి, జనసేన అభ్యర్థి దేవ వరప్రసాద్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీ ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారు. అయితే, సూర్యారావు వైసీపీలో చేరినా, ఆయన కుమార్తె అమూల్య టీడీపీలోనే కొనసాగారు. రాజోలులో జనసేన విజయానికి కృషి చేసి, టీడీపీ క్యాడర్ మద్దతుతో నేడు ఇంచార్జ్‌గా నియమితులయ్యారు. ఈ నియామకం వైసీపీకి షాక్ ఇచ్చింది. సూర్యారావు తన కుమార్తె భవిష్యత్తు కోసం వైసీపీని తాకట్టు పెట్టాడని పార్టీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన నేను ఇంకా వైసీపీ నేతనే అని చెప్పుకుంటున్నా, జగన్ రెడ్డి దాన్ని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.
రాజోలులో వైసీపీ పరిస్థితి దయనీయంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, సూర్యారావు ఇద్దరూ పార్టీని పట్టించుకోవడం మానేశారు. క్యాడర్ క్షీణించి, నాయకత్వం లేని స్థితిలో వైసీపీ ఉంది. అమూల్య టీడీపీ ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టడంతో రాజోలులో టీడీపీ-జనసేన బలం మరింత పెరిగినట్లయింది.