Raj Kasireddy

Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి బిగ్‌ ట్విస్ట్‌.. లిక్కర్ స్కామ్‌లో ‘అప్రూవర్’?

Raj Kasireddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ దుమారం రేగబోతోంది! వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రూ.3,200 కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో అతి పెద్ద బాంబు పేలబోతోంది. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడు, జగన్ మాజీ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి అప్రూవర్‌గా మారే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ట్విస్ట్‌తో జగన్ క్యాంపు ఉలిక్కిపడగా, రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం తప్పేలా లేదు.

లిక్కర్ స్కామ్‌లో రాజ్ కసిరెడ్డిని బలిపశుగా చేసి, జగన్‌తో సహా పెద్దలందరూ తప్పించుకునే ప్లాన్‌ను రచిస్తున్నారని ఆయన లాయర్ సంచలన ఆరోపణలు చేశారు. కసిరెడ్డి లాయర్ మనోహర్ రెడ్డి కోర్టులో బహిరంగంగా ఈ విషయాన్ని ప్రస్తావించడం వెనక పెద్ద కథే ఉంది. “నా క్లయింట్‌ను ఒక్కడినే బలి చేసే కుట్ర జరుగుతోంది. సూత్రధారులు తప్పించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు,” అంటూ కసిరెడ్డి లాయర్‌ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు జగన్ క్యాంపుకు హెచ్చరిక, సీఐడీకి సూచన అని అర్థమౌతోంది. కసిరెడ్డి సమ్మతి లేకుండా, ఆయన లాయర్ ఇలాంటి ఆరోపణలు చేయడం అసాధారణం. అంటే, తనని ఒక్కణ్ణి బలి చేస్తే, అందరి పరువు తీస్తానని కసిరెడ్డి సంకేతాలు పంపినట్లే!

Raj Kasireddy: 2019-2024 మధ్య వైసీపీ పాలనలో జరిగిన ఈ లిక్కర్ స్కామ్‌లో రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఐటీ సలహాదారుగా ఉన్న ఆయన, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మద్యం లైసెన్సులు, సరఫరా ఒప్పందాలను నియంత్రించారు. డిస్టిలరీ కంపెనీల నుంచి నెలకు రూ.50-60 కోట్ల ముడుపులు వసూలు చేసి, ఆ డబ్బును జగన్ ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి వంటి కీలక వ్యక్తులకు చేరవేసినట్లు సీఐడీ ఆరోపిస్తోంది. మొత్తం స్కామ్ విలువ రూ.3,200 కోట్లు అని సీఐడీ అంచనా. కసిరెడ్డి ఈ స్కామ్‌లో ముందు వరుసలో ఉన్నప్పటికీ, అతడు కేవలం కమిషన్‌తో సరిపెట్టుకున్న “బకరా” అని, అసలు లాభం పైస్థాయి నేతలకు వెళ్లిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మరో సంచలనం విజయసాయి రెడ్డి. జగన్ సన్నిహితుడైన విజయసాయి, వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, ఆ వెంటనే కసిరెడ్డిని “లిక్కర్ స్కామ్ సూత్రధారి”గా ఇరికించేశారు. “డబ్బు ఎవరికి వెళ్లిందో కసిరెడ్డికే తెలుసు” అంటూ విజయసాయి సీఐడీ విచారణలో పేర్కొనడం గమనార్హం. ఇది జగన్‌తో గొడవ కారణంగా చెప్పిన మాటలు కాదని, కసిరెడ్డిని బలిపశుగా చేసి.. జగన్‌ను కాపాడే కుట్రలో భాగమని కసిరెడ్డి లాయర్ ఆరోపిస్తున్నారు.

వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడిన కసిరెడ్డి, స్కామ్ డబ్బుతో సినిమా నిర్మాణం, ఆస్పత్రులు వంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. అయితే, తనను ఒక్కణ్ణి బలి చేసే కుట్ర జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తనని ఏదో ఒకలా కాపాడతారని అనుకుంటే.. తన ఒక్కడినే బలి చేయాలని చూస్తున్నారని కసిరెడ్డి భావిస్తున్నట్లు ఆయన లాయర్ మాటల ద్వారా స్పష్టమౌతోంది. ఈ నేపథ్యంలో, కసిరెడ్డి అప్రూవర్‌గా మారి, స్కామ్‌లో జగన్, విజయసాయి, మిథున్ రెడ్డి వంటి పెద్దల పాత్రను బయటపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: mavoist: శాంతి చర్చలకు మావోయిస్టుల పిలుపు – కేంద్రానికి లేఖ

Raj Kasireddy: లిక్కర్ స్కామ్ అత్యంత చాకచక్యంగా రూపొందించిన కుట్ర. ఏ.పీ.ఎస్‌.బీ.సీ.ఎల్‌ను ఉపయోగించి, కొన్ని మద్యం బ్రాండ్‌లకు ప్రాధాన్యం ఇస్తూ, ఇతర బ్రాండ్‌లను నిర్వీర్యం చేశారు. ముడుపులు చెల్లించిన డిస్టిలరీలకు లైసెన్సులు, ఆర్డర్‌లు ఇచ్చి, చెల్లించని వారి బ్రాండ్‌లను తోసిపుచ్చారు. ఈ విధానంలో నెలకు రూ.50-60 కోట్లు వసూలు చేసినట్లు సీఐడీ గుర్తించింది. కసిరెడ్డి ఈ కిక్‌బ్యాక్‌లను సేకరించి, బాలాజీ అనే వ్యక్తి ద్వారా పైస్థాయి నేతలకు చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, కసిరెడ్డి తన వాటాగా భారీ మొత్తాలనే దోచేసినట్లు సీఐడీ నివేదికలు చెబుతున్నాయి. కసిరెడ్డి అప్రూవర్‌గా మారితే, జగన్‌తో పాటు వైసీపీలోని పెద్దలందరూ ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఆయన లాయర్ ఇప్పటికే సీఐడీకి “అప్రూవర్” సంకేతాలు పంపారు. “నన్ను ఒక్కణ్ణి లోపలేస్తే, అందరి బండారం బయటపెడతా,” అని కసిరెడ్డి హెచ్చరిస్తున్నట్లు ఆయన లాయర్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 29 మందిని నిందితులుగా పేర్కొన్న సీఐడీ, కసిరెడ్డి సహకారంతో జగన్‌పై నేరుగా ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. ఇది నిజమైతే, జగన్ రాజకీయ భవిష్యత్తును ఈ స్కామ్ ప్రశ్నార్థకం చేయడం ఖాయం.

టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ స్కామ్‌ను వైసీపీపై ఆయుధంగా మలచుకుంది. సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసి, కసిరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. మరోవైపు, వైసీపీ ఈ ఆరోపణలను “రాజకీయ కుట్ర”గా కొట్టిపారేస్తూ, మీడియా ద్వారా తమ నాయకులను టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తోంది. అయితే, కసిరెడ్డి అప్రూవర్‌గా మారితే, వైసీపీకి ఆ నష్టం పూడ్చలేని స్థాయిలో ఉంటుందని విశ్లేషకుల అంచనా.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *