Power of Antarvedi

Power of Antarvedi: లక్ష్మీ నరశింహ స్వామి గీచిన గీత సముద్రం దాటదా..!

Power of Antarvedi: అంతర్వేదిలో అంతు చిక్కని మిస్టరీ. వశిష్ట గోదారి సముద్రంలో సంగమించే అంతర్వేది. సముద్ర ముఖంగా ఉండే అంతర్వేది లక్ష్మీ నరశింహ ఆలయం. ఆలయానికి, సముద్రానికి మధ్యలో ఓ ధ్వజస్థంభం. ఆ స్థంభాన్ని సముద్రం ఎప్పటికీ దాటదని స్థానికుల నమ్మకం. లక్ష్మీ నరశింహ స్వామి గీచిన గీత సముద్రం దాటదా? తొలత అంతర్వేది పాలేన్ని తాకిన మొంతా. అక్కడనుంచి పశ్చిమదిశగా వెళ్లి నర్సాపురంతీరం దాటిన మొంతా తుపాన్‌. గతంలో దివిసీమ ఉప్పెన సమయంలో కూడా ఇదే అనుభవం. అంతర్వేది నుంచి దివిసీమ వైపుకు పయనించిన నాటి తుఫాన్. కోనసీమ తుపాన్‌ సమయంలోనూ కాకినాడ దగ్గరకు వెళ్లిన తుఫాన్‌. మరి అంతర్వేది దగ్గర తీరం దాటక పోవడానికి శాస్త్రీయ కారణం ఉందా? అక్కడ సముద్రం యూ షేప్‌లో ఉండడం వల్లనే ఇలా జరుగుతోందా? తీరం తాకినా ఆ తరువాత అటో ఇటో వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందా? మొంథా తుపాన్‌ నేపథ్యంలో మరోసారి తెరపైకి తెచ్చిన చర్చనీయాంశం ఇదే.

Also Read: Skywalks: మరో ఆరు స్కై వాక్ లపై దృష్టి పెట్టిన ప్రభుత్వం

అంతర్వేదిలో బియ్యప్పుతిప్ప అన్నాచెల్లెల గట్టు నుంచి బైరవపాలం గాడిమొగ్గ వరకూ ఒక్కసారి కూడా తుఫాన్‌ తీరం దాటకపోవడం అంటే ఆశ్చర్యం కలిగించక మానదు. వీటి మధ్య భూభాగంలోనే అంతర్వేది లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం ఉంది. లక్ష్మీనర్సింహాస్వామి ఆశీస్సులతో పకృతి వైపరీత్యాలు ఈ గడ్డని తాకవని గోదావరి జిల్లా వాసుల విశ్వాసం. 1996లో ఒక తుఫాన్ అంతర్వేది వద్ద తీరాన్ని దాటనుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 240 కిలోమీటర్లు వేగంతో కాకినాడ, కోనసీమలను అల్లాడించిన నాటి తుఫాన్… అంతర్వేదిని కాదని కాకినాడకు దక్షిణం వైపు మరలి, 50 కిలోమీటర్లు పయనించి, అక్కడ తీరాన్ని తాకింది. ఇక 1977లో మరో తుఫాన్ అంతర్వేది సమీపంలోనే తీరాన్ని తాకుతుందని వాతవరణ శాఖ హెచ్చరించింది. ఆ తుఫాన్ సైతం సునామీగా మారి దివిసీమపై విరుచుకుపడింది. మెంథా తుఫాన్ కూడా కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ వేగాన్ని తగ్గించుకుని ముందుగా అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని టచ్ చేసిన మెంథా… అక్కడే తీరం దాటుతుందని అందరూ భావించారు. అయితే విచిత్రంగా మెంథా తుపాన్‌ గమనం మార్చుకుని నరసాపురం సమీపంలోని పాతపాడు వద్ద తీరం దాటింది.

ఆ లక్ష్మీ నర్సింహాస్వామే మరోసారి తమని రక్షించాడంటూ అంతర్వేది పరిసర గ్రామాల ప్రజలు చెబుతుండటం గమనార్హం. అయితే తుఫాన్ అక్కడ తీరం దాటకపోవడానికి సముద్రతీరం ఆకారమే కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇండియా మ్యాప్‌లో చూస్తే… ఆ ప్రాంతంలో ‘యూ’ ఆకరంగా సముద్రతీరం లోనికి ఉంటుంది. అటువైపు, ఇటువైపు భూమి సముద్రంలోకి ఉండటం వలన తుఫాన్ ఆ ప్రాంతాన్ని తాకలేకపోతుందని సైన్స్ చెపుతోంది. కానీ గ్రామస్తుల నమ్మకాన్ని తప్పుబట్టలేం. ఎందుకంటే… సైన్స్‌కి అందని విధంగా ప్రకృతి విపత్తులు ఉంటాయి. ప్రకృతి విలయాలను అత్యంత ఖచ్చితంగా పసిగట్టడం కానీ, ఖచ్చితంగా అంచనా వేయడం కానీ.. ఇప్పుడున్న సైన్స్‌, టెక్నాలజీకి సాధ్యంకాదు. సైన్స్‌కు మించిన శక్తి, అది దైవశక్తో, మరొకటో అంతర్వేదిలో పనిచేస్తూ ఉండొచ్చని మాత్రం చెప్పగలం అంతే.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *