Pawan Kalyan Bata

Pawan Kalyan Bata: సినిమాకు మించి కిక్కు.. పవన్‌ సూపర్‌ హిట్లు!

Pawan Kalyan Bata: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్, అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలోనే గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి బాటలు పరిచారు. సామాన్యుడి సమస్యలను స్వయంగా గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు ఆయన చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఐకానిక్‌ ఈవెంట్లుగా మారాయి. పల్లె పండుగ, గ్రామ సభలు, అడవితల్లి బాట, మన వూరు మాటా-మంతి వంటి అత్యంత వినూత్న కార్యక్రమాలతో పవన్, గ్రామీణుల జీవన సరళిని సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు.

కూటమి అధికారంలోకి వచ్చాక, డిప్యూటీ సీఎంగా, ఐదు కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. పవన్‌ తొలుత చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పల్లె పండుగ. ఇది గ్రామీణ ఆంధ్రకు పునర్జన్మనిచ్చే శక్తివంతమైన ప్రోగ్రామ్‌. గ్రామాల్లో రహదారులను ఆధునీకరించి, మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందింది. కేంద్ర ఉపాధి హామీ పథకంతో సమన్వయం చేసి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేశారు పవన్‌ కళ్యాణ్. ఈ పథకం గ్రామాలను శక్తిమంతం చేస్తూ.. గ్రామీణుల జీవనోపాధికి కొత్త బాటలు పరిచింది. ఇక ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా 13326 పంచాయతీల్లో నిర్వహించిన గ్రామ సభలు, పవన్ సంకల్పానికి నిదర్శనం. ఈ సభల ద్వారా గ్రామీణ సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు పవన్‌కళ్యాణ్‌ తీసుకున్న చొరవ అసాధారణం.

సీఎం నుంచి అధికారుల వరకు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడంతో, ఈ గ్రామ సభలు ప్రపంచ రికార్డును సృష్టించాయి. వైసీపీ హయాంలో జవసత్వాలు కోల్పోయిన గ్రామాలకు బూస్టింగ్‌ ఇచ్చాయి పవన్‌ గ్రామసభలు. ఇక గిరిజన ఆంధ్రకు ఆలంబనగా పవన్‌ చేపట్టిన అడవితల్లి బాట.. మరో సంచలనం. మారుమూల గిరిజన గ్రామాలకు పవర్‌ అడవితల్లి బాట ఒక వరంగా నిలిచింది. రహదారుల నిర్మాణం, స్వచ్ఛమైన తాగునీరు, మౌలిక సౌకర్యాల కల్పన ద్వారా గిరిజనుల జీవనప్రమాణాలు, జీవనోపాధి మెరుగుపడ్డాయి. గిరిజనుల డోలీ బాధలను తొలగించిన ఈ చొరవ, రాష్ట్ర గిరిజనానికి కొత్త ఉత్తేజాన్నిచ్చింది. ఇక తాజాగా పవన్‌ చేపట్టిన మరో ట్రెండ్‌ సెట్టింగ్‌ కార్యక్రమం ‘మన వూరు.. మాటా-మంతి’. ఇది గ్రామీణుల్లో కొత్త ఆశలు నింపిన సినిమాటిక్ వేదిక. గ్రామీణ సమస్యలను వర్చువల్‌గా విని, పరిష్కరించే ఒక వినూత్న ప్రయోగం. సినిమా హాళ్లలో వెండితెర వేదికగా పవన్ కల్యాణ్ గ్రామీణులతో నేరుగా సంభాషించి, వారి సమస్యలను అర్థం చేసుకుని, భరోసా కల్పిస్తున్నారు.

Also Read: GDP: ఆర్థిక వ్యవస్థలో జపాన్ ను దాటేసిన భారత్

Pawan Kalyan Bata: ఈ కార్యక్రమం గ్రామాల్లో అభివృద్ధి దిశగా కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఇక.. రెండు దశాబ్దాలుగా ఏపీలోని ఏజెన్సీ ప్రాంత రైతులు అనుభవిస్తున్న కష్టాలకు చెక్‌ పెడుతూ.. పంటలను నాశనం చేస్తున్న ఏనుగల బెడదను తప్పించేలా.. కర్ణాటక నుండి కుంకీ ఏనులను రప్పించడంలో పవన్‌ కళ్యాణ్‌ సఫలీకృతం అయ్యారు. కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఏపీలో ఉన్నది ఎన్డీయే కూటమి ప్రభత్వం. అయినప్పటికీ పవన్‌ లౌక్యంతో కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలు అయిన సిద్ధరామయ్య, శివకుమార్‌ ఆతిథ్యాన్ని అందుకున్న పవన్‌, 6 కుంకీ ఏనుగులను తొలి విడతగా ఏపీ రప్పించారు. మలి విడతలో మరిన్ని కుంకీ ఏనుగులు ఏపీకి రానున్నాయి. రెండేళ్లుగా వెండితెరపైన కనిపించకున్నా.. ఏడాది పాలనలో.. పవన్‌ సాధించిన సూపర్‌ హిట్లతో జనసైనికులు, పవన్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారట.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *