Pawan Jagan Potthu

Pawan Jagan Potthu: వాట్‌ వైసీపీ? వాటీజ్‌ దిస్‌ కొలవెరి?

Pawan Jagan Potthu: కూటమిలో చిచ్చు రేపేందుకు గత వారం రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తోంది వైసీపీ. చేసిన ప్రయత్నాలన్నీ టైమ్‌ పాస్‌ వ్యవహారాలుగా చూసింది ఏపీ ప్రజానీకం. కూటమి నేతలు పెద్దగా పట్టించుకుంది లేదు. రగడగకు మూల కారణమైన బీజేపీ ఎమ్మెల్యే కామినేని వ్యాఖ్యల్ని అసెంబ్లీ రికార్డుల నుండి తొలగించేశారు. ఇక అఖండ ఆ రోజు నుండి అజ్ఞాతవాసంలోనే ఉన్నట్లున్నారు. చిరంజీవి తొందరపడి ఒక లెటర్‌ రిలీజ్‌ చేశారు కానీ… ఆ తర్వాత ఇంతటితో వదిలిపెట్టండి అంటూ ఫ్యాన్స్‌కి సంకేతాలు పంపారు. బాలయ్య ఫ్యాన్స్‌ మొత్తానికే రివర్స్‌ అయ్యి.. వైసీపీనే ఏకి పారేస్తున్నారు. మెగాస్టార్‌కు అవమానం అంటూ ఆయన కంటే, ఆయన ఫ్యాన్స్‌ కంటే ఎక్కువ ఫీల్‌ అయిపోతూ కథనాలను వండి వార్చారు. మైకులు తీసుకెళ్లి ఆయన ముందు పెట్టారు. కానీ బలవంతంగా ఒక్క మాట కూడా చిరు నుండి చెప్పించలేక పోయారు. మరోవైపు పవన్‌కి వైరల్‌ ఫీవర్‌ అనగానే చంద్రబాబు స్వయంగా హైదరాబాద్‌ వచ్చి పవన్‌ని పరామర్శించారు. కోలుకున్న పవన్‌.. తన అన్న చిరంజీవితో కలిసి ఎంచక్కా ఓజీ మూజీ ఎంజాయ్‌ చేయడమే కాకుండా.. ఓజీ-2 కూడా ఉంటుందని ఫీలర్‌ వదిలారు. పవన్‌-చంద్రబాబు భేటీ, పవన్‌-చిరు ఓజీ వాచింగ్‌.. ఈ రెండు ఘటనల తర్వాత ఇక వైసీపీ పోరాటాన్ని పట్టించుకునే వాడే లేకుండా పోయాడు. దీంతో రూటు మార్చి అవతలి వైపు నుండి నరుక్కుంటూ వద్దామని మొదలెట్టింది వైసీపీ సోషల్‌మీడియా. కూటమిలో చిచ్చుకు ప్రయత్నాలన్నీ నీరుగారి పోయాయన్న ప్రస్టేషన్‌లో… పవన్‌ కళ్యాణ్‌ లాంటి పవర్‌ మనవైపు ఉంటే తిరుగే ఉండదని వైసీపీ క్యాడర్‌లో ఏదో మూలన దాగి ఉన్న ఓల్డ్‌ డిజైర్‌ బయటకొచ్చేసింది.

Also Read: Sana Mir: దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు.. పాక్ మాజీ క్రికెటర్

రూటు మార్చిన వైసీపీ సోషల్‌మీడియా తాజాగా‘పవన్+జగన్=వైనాట్‌ 175’ అనే కొత్త రాగం ఆలపిస్తోంది. పవన్‌తో పొత్తు కుదిరితే అధికారం సాధ్యమనే ఆలోచనతో, సోషల్ మీడియాలో కథనాలు, పోస్టులతో తాజా హడావిడి చేస్తున్నారు. అందుకు కొందరు జనసేన కార్యకర్తలు వెరైటీగా రియాక్ట్‌ అవుతున్నారు. మీ జగనన్నను సీఎం పదవి ఆఫర్‌ చేయమనండి… మా పవనన్న ఆలోచిస్తాడేమో చూద్దాం అంటూ పోస్టులు పెడుతున్నారు. ఒకవేళ జగన్ సీఎం పదవి ఇస్తారని అన్నా… ఎవరూ నమ్మరు. గతంలో కమ్యూనిస్టు పార్టీలను వాడుకొని, ఎన్నికల్లో సీట్లు ఇవ్వకుండా మోసం చేసిన జగన్ చరిత్రను ఉండవల్లి వంటి వారు గుర్తు చేస్తున్నారు. పవన్‌తో పొత్తు అన్న చర్చని వైసీపీ సోషల్‌మీడియా శ్రేణులు తెరపైకి తెచ్చి రెండ్రోజులు అవుతున్నా.. వైసీపీ మాత్రం ఎలాంటి యాక్షన్‌ తీసుకోలేదు. అలాంటి చర్చపై పార్టీ సోషల్‌మీడియా శ్రేణులకు ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇచ్చినట్లు కూడా లేదు. బహుషా వైసీపీ అధిష్టానం కోరుకుంటోంది, ఆశపడుతోంది కూడా అదేనేమో. ఏది ఏమైనా.. పవన్‌ – జగన్‌… రెండు భిన్న ధృవాలు. ఆ రెండు కలవడం అసాధ్యం. ఒకవేళ గత్యంతరం లేక పవన్‌ని కలుపుకునేందుకు జగన్‌ ఏకంగా సీఎం పదవిని ఆఫర్‌ చేసినా… పవన్‌ గడ్డి పరకలా తీసేయడమే జరుగుతుంది తప్ప.. పవన్‌, జగన్‌లను ఒకే వేదికపై, ఒకే గొడుగు కింద చూడాలనుకోవడం వైసీపీ శ్రేణుల అత్యాశే అవుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *