Nandamuri Varasuralu: నందమూరి అభిమానులకు పండగే పండగ! నందమూరి కుటుంబం నుంచి మొదటిసారిగా ఒక మహిళా స్టార్ స్క్రీన్‌పై మెరిశారు. నందమూరి బాలకృష్ణ గారి కూతురు, వైజాగ్ ఎంపీ శ్రీభరత్ సతీమణి నందమూరి తేజస్విని… సిద్ధార్థ ఫైన్ జ్యువలరీ యాడ్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టారు. తేజస్విని స్క్రీన్‌పై కనిపించడంతో సోషల్ మీడియా మొత్తం మోగిపోతోంది. ‘నందమూరి ఫ్యామిలీకి హీరోయిన్ దొరికేసింది’ అంటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన ‘సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్’ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా తేజస్వినిని ప్రకటించింది. ఈ మేరకు చిత్రీకరించిన కమర్షియల్ యాడ్ వీడియో తాజాగా విడుదలైంది. ఆమె హుందాతనం, సంప్రదాయబద్ధమైన రూపం తమ బ్రాండ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సంస్థ పేర్కొంది. తేజస్విని తెరపై కనిపించడంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Allu Sirish: అల్లు శిరీష్ – నయనికా రెడ్డి నిశ్చితార్థం ఘనంగా
తేజస్విని, విశాఖపట్నం ఎంపీ మాథుకుమల్లి భరత్ అర్ధాంగి అన్న విషయం తెలిసిందే. ఈ ప్రచార చిత్రానికి వై.యమున కిషోర్ దర్శకత్వం వహించగా, ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. ఎస్.ఎస్.థమన్ అందించిన సంగీతం, అయాంకా బోస్ ఛాయాగ్రహణం ఈ యాడ్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి. నాగిని ప్రసాద్ వేమూరి, శ్రీమణి మతుకుమల్లి, శ్రీదుర్గా కత్రగడ్డ అనే ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తలు ‘సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్’ సంస్థను నడుపుతున్నారు. తేజస్విని భాగస్వామ్యంతో తమ బ్రాండ్ వారసత్వం, కళ, సౌందర్యం వంటి విలువలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని వారు తెలిపారు. ఈ పరిణామం తేజస్విని కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడమే కాకుండా, నందమూరి వారసురాలిగా ఆమెకు సరికొత్త గుర్తింపును తెచ్చిపెడుతోంది. కాగా, తేజస్విని ఇప్పటికే సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఆమె తన తండ్రి బాలకృష్ణకు ‘అన్‌స్టాపబుల్’ షోతో పాటు ‘డాకు మహారాజ్’ వంటి సినిమాలకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు.

