MLA Bashyam Toli Adugu: పెదకూరపాడు నియోజకవర్గం… నరుకుళ్లపాడు గ్రామం. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ని వెంటబెట్టుకుని గ్రామాన్ని సడన్ విజిట్ చేసింది మహాన్యూస్. ఆ గ్రామంలోని ఓ సాధారణ కుటుంబాన్ని కదిలించింది. సంక్షేమ పథకాల లబ్ధిపై ఆరా తీసింది. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్, 4 వేల రూపాయల పింఛన్.. ఇలా సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అందట్లేదా? ఆలస్యం ఏమైనా జరుగుతోందా? అని మహాన్యూస్ లైవ్‌లోనే అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. మరి సంక్షేమం విషయంలో ఆ కుటుంబంలోని గృహిణి, పిల్లలు, వృద్ధులు వ్యక్తం చేసిన అభిప్రాయం ఏంటో… ఎస్సీ కాలనీలో ఉంటున్న ఆ కుటుంబం ఓ పూరింట్లో ఉంటుండటం గమనించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్పాట్‌లో ఏం చేశారో చూడండి.
ప్రజల సమస్యలు అన్నీ ప్రభుత్వాలకు నోటెడ్ కావు. కొన్నిసార్లు తమ సమస్యల పరిష్కారానికి ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో తోచక సామాన్యులు సతమతమవుతుంటారు. ప్రజల సమస్యలు తెలియాలంటే ప్రజా ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లటం ఒక్కటే దారి. అందుకే కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘తొలి అడుగు’ కార్యక్రమం పేదల ప్రశంసలు అందుకుంటోంది. ఇక ఓ నిరుపేద కుటుంబంలో చదువుకుంటున్న ఆ పిల్లలకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటి? ఒక సమస్యకు తోడు మరో సమస్య వారిని ఎలా వెంటాడింది? మహాన్యూస్‌తో కలిసి పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వేసిన ముందడుగులో.. తన దృష్టికొచ్చిన ఆ విద్యార్థుల సమస్యకు ఎమ్మెల్యే చూపిన పరిష్కారం ఏమిటి? మీరే చూడండి.
Also Read: Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు మరోసారి ఈడీ నోటీసులు
అందుతున్న పథకాలు, ప్రభుత్వం, ఎమ్మెల్యే పనితీరు, స్థానిక సమస్యలపై ప్రజల్ని అడిగి తెలుసుకుంటున్న క్రమంలో…. తమని ఇబ్బంది పెడుతున్న ఓ సమస్యపై ఎమ్మెల్యేని నిలదీశారు స్థానిక మహిళలు. అధికారుల చిన్న చొరవతో పరిష్కారం అయ్యే ఆ సమస్య, అక్కడి కాలనీ వాసులకు పెద్ద ప్రాబ్లమ్‌గా మారింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే… అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి.. ఒక్క రోజులో సమస్య పరిష్కారం కావాలని ఆదేశించడం అక్కడి వారిని ఆకట్టుకుంది. ఇక ఏడాదిలో నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చెబుతోన్న మాట ఇది.