Jogi MOB Killing plan

Jogi MOB Killing plan: కేవలం నకిలీ మద్యం కాదు.. జోగి అరాచకం అంతకు మించి!

Jogi MOB Killing plan: కుట్రలు బయటపడ్డాయా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న నకిలీ మద్యం అంశంలో అధికార కూటమి, విపక్ష వైసీపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల నడుస్తున్న నేపథ్యంలో.. వాస్తవాలు బయటకొస్తున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ దందా మొత్తం ఒక థ్రిల్లర్ సినిమా స్క్రిప్ట్‌లా కనిపిస్తోందంటున్నారు పొలిటికల్‌ ఎక్స్‌పర్ట్స్‌ సైతం. ప్రణాళిక, ఎక్సిక్యూషన్, ట్విస్ట్‌లతో.. మాజీ మంత్రి జోగి రమేష్ ఈ కథకు డైరెక్టర్‌గా మారినట్టు ఆరోపణలు ఎదురవుతున్నాయి. ప్రధాన ఆరోపితుడు అద్దెపల్లి జనార్దన్ రావు వీడియోలు, వాట్సాప్ చాట్‌లు—అన్నీ జోగి ముందస్తు ప్రణాళికను బయటపెట్టాయి. ఈ కుట్ర ప్రకారం, జోగి రమేష్ మొదట ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించాలని ప్లాన్ చేశారు. “అక్కడ దందా మొదలుపెట్టి, మనవాళ్లతోనే పోలీసులకు ఉప్పందిద్దాం. మీడియాలో సంచలనంగా మారి, చంద్రబాబు ప్రభుత్వానికి అప్రతిష్ట రావాలి. ఇదే మన ‘నకిలీ మద్యం’ సినిమాకి స్క్రిప్ట్!” అంటూ జనార్దన్ రావుకు సూచనలు ఇచ్చినట్టు వాట్సాప్ చాట్‌లు లీక్ అయ్యాయి. ఈ చాటింగ్‌తో నకిలీ మద్యం కుట్రలో జోగి పాత్ర స్పష్టమైంది. ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని, అపఖ్యాతి తీసుకురావలని స్పష్టమైన ఆలోచనలతోనే ఈ స్క్రిప్ట్‌ నడిచినట్లు తెలుస్తోంది. ఆర్థిక సహాయం కూడా జోగి చేతి నుంచే వచ్చినట్టు ఆరోపణలున్న నేపథ్యంలో.. అందుకు పక్కా సాక్ష్యాలు సంపాదించే పనిలో ఇప్పుడు సిట్‌ ఉంది.

Also Read: CRDA Building Specialty: అమరావతి తొలి శాశ్వత కట్టడం ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

ఈ ప్లాన్‌తో కూటమి ప్రభుత్వంపై పెద్ద కుట్రకే తెరతీశారు కానీ, ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవడంలో వారి ఆటలు సాగలేదు. అక్టోబర్ 3న ములకలచెరువులో తయారీ యూనిట్లు, ఇబ్రహీంపట్నంలో గోడౌన్‌లు దాడి చేసి మూసివేశారు. జనార్దన్ రావును అరెస్ట్ చేసి, సిట్‌ విచారణ మొదలుపెట్టారు. ఈ చర్యలు తీసుకున్న వెంటనే వాట్సాప్ చాట్‌లు లీక్ అవ్వడంతో.. ‘క్లైమాక్స్’కు ముందే జోగి గుట్టు రట్టు అయ్యింది. మొత్తానికి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారు జోగి రమేష్‌. చేయాల్సిన అరాచకమంతా చేసేసి ఇప్పుడు అమానుష యాగీ చేస్తున్నారు జోగి. సీబీఐ, ఎఫ్‌బీఐ విచారణ కావాలంటూ కేకలేస్తున్నారు. దేవునిపై ప్రమాణాలంటూ విచిత్రమైన యాగీ చేస్తున్నారు. భార్యాబిడ్డల్ని ఇందులోకి లాగి, ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌కి దిగుతున్నారు. అయితే… జోగి చేసింది ‘నకిలీ’ దందా, ప్రభుత్వంపై కుట్ర మాత్రమే కాదు. మద్యం ప్రియుల ప్రాణాలతో ప్రమాదకరమైన ఆట. ఒక పార్టీ మీద పగ సాధించేందుకు ఇంతకు దిగజారాలా? ప్రజల ప్రాణాలను బలిపీఠం ఎక్కించి, రాజకీయ క్రీడలా? వైసీపీ ‘నకిలీ’ బుద్ధికి కుటుంబాలు రోడ్డున పడాలా? రాజకీయ రక్త దాహానికి మహిళల తాళిబొట్లు బలి కావాలా? ఇదేనా రాజకీయం? ఇందుకేనా వైసీపీకి మరో చాన్స్‌ ఇవ్వాలి? అంటూ ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి. ఒకపక్క మనుషుల ప్రాణాలతో నకిలీ వ్యాపారం చేస్తూ… మరోపక్క ఓదార్పంటూ రాజకీయ శవ యాత్రలు చేస్తారా? జోగి చేసింది భూమ్మీద క్షమించరాని నేరం కాదా? అందుకేనా చిన్న వాట్సాప్‌ ఆధారానికే అంత బెంబేలు? తప్పుచేసి భార్యాబిడ్డల్ని అడ్డుపెట్టుకోవడం సిగ్గుచేటు కాదా? ఇవీ వైసీపీకి, జోగి రమేష్‌కి నైతికంగా ఎదురవుతున్న ప్రశ్నలు. విచారణ చేస్తున్న సిట్‌ కానీ, కోర్టులు కానీ.. వీరి పాపాలకు శిక్ష పడేలా చేస్తాయో లేదో కానీ.. ప్రజలు మాత్రం మరోసారి శిక్షించడానికి సిద్ధమౌతున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *