Jagan on Google

Jagan on Google: జగన్‌ వస్తే గూగుల్‌ని ఉంచుతారా? తరిమేస్తారా?

Jagan on Google: విశాఖకు గూగుల్‌ రాకపై ప్రపంచమంతా హర్షిస్తుంటే.. వైసీపీ నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగాలు వందల్లోనే అని, ఎంత నీరైనా సరిపోదని, విద్యుత్‌ ఖర్చు అస్సలు భరించలేమని, డేటా సెంటర్లతో విశాఖ ఎడారి అవుతుందని వైసీపీ మొదట్నుంచీ ప్రచారం చేస్తోంది. వైసీపీది ఇదొక స్టాండ్‌ అయితే… వైసీపీలోనే కొందరు మరో స్టాండ్‌ తీసుకున్నారు. అదానీ వల్లే గూగుల్‌ వస్తోందంటూ ఊదరగొడుతున్నారు. అది జగన్‌ వల్లే సాధ్యమైందంటూ కీర్తిస్తున్నారు. ఇదంతా సరే. యూరప్‌ నుండి వచ్చి మూడ్రోజులు అవుతున్నా… గూగుల్‌ డేటా సెంటర్‌పై వైసీపీ అధినేత జగన్ స్పందించకపోవడం ఏంటన్నది వైసీపీలోనే ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు గూగుల్‌పై జగన్‌కు ఓ స్పష్టమైన క్లారిటీ ఉందా? మొదట్నుంచీ మీడియాలో మాట్లాడుతున్న గుడివాడ అమర్‌నాథ్‌ అభిప్రాయాలే జగన్‌ అభిప్రాయాలా? గూగుల్‌ను జగన్‌ స్వాగితిస్తున్నరా? వ్యతిరేకిస్తున్నారా? అన్నది అంతుపట్టట్లేదు.

Also Read: Donald Trump: రష్యా చమురుపై ట్రంప్ సంచలన ప్రకటన

నిజానికి జగన్‌కి ఇది కొత్తేమీ కాదు. ఆయన రాజకీయం తెలిసిన వారికి వింతేమీ కాదు. జగన్‌ రాజకీయం డిఫరెంట్‌. ఆయన తనకు నష్టం కలిగిస్తుందన్న విషయాలేవీ నేరుగా మాట్లాడరు. ఆయన ఏది చెబితే అదే వాదనని గుడ్డిగా వినిపించే కొందరు నేతల్ని ఎంపిక చేసుకుని వారితో మాట్లాడిస్తారు. బూమరాంగ్‌ అయితే.. అది వారి సొంత అభిప్రాయమని కవర్‌ చేసేందుకు అలా జాగ్రత్త పడుతుంటారు. కానీ, నడవాల్సిన రాజకీయం, రచ్చ మాత్రం నడిచిపోతుంటాయి. వైసీపీ చెబతోంది, చేస్తోంది కరెక్ట్‌ అని నమ్మేవారు కలిసొస్తారు. తప్పని భావించే వారు జగన్ ఏం చెబుతారో చూద్దామని ఎదురుచూస్తుంటారు. కానీ జగన్‌ బయటపడరు. అమరావతిపైనా వైసీపీ ఇలాగే పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేసింది. అమరావతే రాజధాని అంటూ సజ్జల, జోగి, ఇతర నేతల చేత మాట్లాడించింది వైసీపీ. కానీ జగన్‌మోహన్‌రెడ్డి మనసులో మాత్రం వేరే ఆలోచన ఉంటుంది. సోషల్‌మీడియాలో మరో ప్రచారం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు గూగుల్‌ విషయంలోనూ జగన్‌ది అదే తీరని స్పష్టమౌతోంది. దీన్నిబట్టి జగన్‌ ఎంత తెలివిగా రాజకీయం చేస్తారో, ప్రజల్ని ఎంత తేలికగా ఫూల్స్‌ని చేయాలని అనుకుంటారో అర్థమవుతోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *