Jagan in Danger: తెలంగాణలో కేసీఆర్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపులు తీసుకుంటూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఇరకాటంలోకి నెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన ఫోన్‌తో పాటు తన సన్నిహితుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయని, ఈ కుట్రలో జగన్, కేసీఆర్‌ల పాత్ర ఉందని ఆరోపించారు. జగన్‌కు రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం తెలంగాణ సర్కార్ ఈ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు విచారణలో ఆధారాలు లభిస్తున్నాయి. ఈ కేసులో స్పెషల్ బ్రాంచ్ మాజీ అధికారి ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి వచ్చి విచారణకు హాజరవుతుండటం కీలక మలుపులకు కారణమవుతోంది.
2023 ఎన్నికల ముందు 4200కు పైగా ఫోన్లు, వాటిలో షర్మిల, చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోన్లు కూడా ట్యాప్ చేయబడినట్లు సిట్ విచారణలో వెల్లడైనట్లు సమచారం. షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టి కేసీఆర్‌ను విమర్శించిన నేపథ్యంలో, ఆమె కదలికలను జగన్‌కు చేరవేసేందుకు ఈ ట్యాపింగ్ జరిగినట్లు ఆమె అనుమానిస్తున్నారు. జగన్, కేసీఆర్‌ల మధ్య సన్నిహిత బంధం ఈ కుట్రకు ఆధారమని చెబుతున్నారు. ఇప్పటికే మద్యం కుంభకోణంతో ఒత్తిడిలో ఉన్న జగన్‌కు ఈ కేసు మరో గండంగా మారే అవకాశం ఉంది. వైసీపీ నేతలైన వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌లతో ఆ పార్టీ కుదేలైంది. తాజాగా కొడాలి నానిని కోల్‌కతా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. షర్మిల విచారణకు హాజరై వాంగ్మూలం ఇస్తే, ఈ కేసు జగన్‌ను మరింత ఇరుకున పెట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Canada: ఒక తప్పు జరిగింది.. భారతదేశాన్ని వ్యతిరేకించే వారికి మేము ఆశ్రయం ఇచ్చాము..
జగన్‌పై ఇప్పటికే 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసులు నడుస్తున్నాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన స్కాములన్నింటిలో అంతిమ లబ్ధిదారు జగన్ రెడ్డేనని.. ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న కుంభకోణాల కేసుల తీరును బట్టి అర్థమౌతోంది. అయితే ఇవన్నీ అవినీతి, అధికార దుర్వినియోగానికి సంబంధించిన కేసులు. ఇలాంటి కేసుల్లో ఎలా తప్పించుకు తిరగాలో, ఏళ్ల తరబడి కోర్టుల్లో ఎలా నాన్చాలో, బెయిల్‌పై దశాబ్ద కాలంగా బయట ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి కొట్టిన పిండి అని చెప్పొచ్చు. కానీ ఫోన్ ట్యాపింగ్ అంతకు మించిన తీవ్రమైన నేరం. కేంద్రం జోక్యం చేసుకుంటే, విచారణ కరెక్టుగా జరగనిస్తే, వ్యవస్థలని తమ పని తాము చేసుకోనిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ రెండు పార్టీలు చరిత్రలో కలిసిపోవడం ఖాయం. ఫోన్ ట్యాపింగ్ అంతటి తీవ్రమైన నేరం కాబట్టే.. వైసీపీలో ఆందోళన కలిగిస్తోంది. ఎప్పటికైనా ఈ కేసు తమ ఉనికికే ప్రమాదకరం అని గుర్తించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. గులాబీ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కూడా సిద్ధమై కూర్చుకున్నారన్న వాదన వినిపిస్తోంది. మరి జగన్ పరిస్థితి ఏంటన్నదే ఇక్కడ ప్రశ్రార్థకంగా మారింది. విచారణ దిశను బట్టి ఈ కేసు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేయవచ్చని పరిశీలకులు అంటున్నారు. మరి జగన్‌పై ఉచ్చు బిగుస్తుందా, లేక ఈ ఆరోపణలు గాలిలో కలిసిపోతాయా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.