Gramalalo Pawanism

Gramalalo Pawanism: గెట్‌ రెడీ.. పవన్‌ శాఖపై సంచలన డ్రైవ్‌..!

Gramalalo Pawanism: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మొత్తం ఆరు మంత్రిత్వ శాఖలను నిర్వర్తిస్తున్నారు. వాటిలో మూడు శాఖలు గ్రామాలు-వాటి సమస్యలు-బాగోగులకు సంబంధించినవే. గాంధీజీ పేర్కొన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసే పంచాయతీరాజ్‌ శాఖ, గ్రామాల రూపు రేఖలు మార్చేసి, పల్లె ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచి, పల్లెను ప్రగతి పథంలో నడిపించే గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ ప్రాంతాలలో ప్రజల దాహార్తి తీర్చే గ్రామీణ నీటి సరఫరా శాఖలు పవన్‌ చూస్తున్నారు. గతంలో ఈ శాఖలను నిర్వర్తించిన మంత్రుల పేర్లు కూడా ఎవరికీ తెలిసేవి కావు. కానీ నేడు పల్లెలంటే పవనుడే గుర్తొస్తున్నాడు ఆంధ్ర ప్రజలకు. ఆయన మార్గదర్శకంలో ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ భారతం మరో నవశకం దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది.

సింప్లిసిటీలో ఉన్న హీరోయిజం మరేదాంట్లో ఉండదు. అందుకు ఫర్ఫెక్ట్‌ ఉదాహరణ పవన్‌ కళ్యాణ్‌. ఆయన తెరపైనే కాదు.. పాలనలోనూ పవర్‌స్టారే అనిపించుకున్నారు. సమర్థత, స్థిరత్వం ఆయన పాలనకు కొలమానాలుగా నిలిచాయి. ఏడాది పాలనలో గ్రామాలను బలోపేతం చేసిన పవన్, మరోవైపు సొంత నిధులతో మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. స్వార్థం, అధికార గర్వంలేని నాయకుడు ప్రజల కోసమే జీవిస్తాడని పవన్‌ నిరూపిస్తున్నారు. రాజకీయం అంటేనే సాయం అనేలా మార్చేశారు. గ్రామీణ భారతాన్ని బలపరిచే సంకల్పమయ్యారు. పవనిజం అంటే దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల్లో వెలుగులు నింపడం, గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడమేనని పవన్‌ తన పాలన ద్వారా నిరూపిస్తున్నారు. అందుకే పల్లె పల్లెలో పవనిజం అంటోంది మహాన్యూస్‌.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్… రాజకీయాల్లో పీపుల్స్‌ లీడర్‌గా స్వచ్ఛమైన పాలనను ఆవిష్కరించారు. అధికార గర్వం, లాలసలకు తావు లేకుండా, సామాన్యుడి సమస్యలకు సమాధానమైన పవన్, ఈ ఏడాదిలో తన పాలనా దక్షత, సాయమందించే మనసుతో అందరినీ ఆకట్టుకున్నారు. గడిచిన ఏడాదిలో పవన్ పాలనా శైలిలో మనకు కనిపించేవి సింప్లిసిటీ, సమర్థత, స్థిరత్వం. పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖలకు మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు గ్రామీణ భారతాన్ని బలోపేతం చేశాయి. గ్రామ సభలను ఏకకాలంలో నిర్వహించి, సమస్యలపై చర్చించే వేదికను సృష్టించారు. ‘అడవితల్లి బాట’ కార్యక్రమంతో గిరిజనులకు చేరువై, మన్యం ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు.

Also Read: Pawan Kalyan: మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటం.. వైసీపీ నేతలకు అలవాటుగా మారింది

Gramalalo Pawanism: గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి, వేలాది మందికి ఉపాధి కల్పించారు. శ్రామికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా వారి గౌరవాన్ని పెంచాలని సంకల్పించారు. సర్పంచులకు చెక్‌ పవర్‌, నిధుల కేటాయింపుతో గ్రామ స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించారు. రెండు నెలల్లో లక్ష ఫారం పౌండ్లు, ఆరు నెలల్లోనే 12,500 మినీ గోకులాలు, ‘పల్లె పుష్కరిణి’ కార్యక్రమంతో 660 మండలాల్లో చెరువులు, బావులు… జల్‌ జీవన్‌ మిషన్‌ పరుగులు, ఇవన్నీ పవన్‌లోని దూరదృష్టిని, గ్రామీణాభివృద్ధి పట్ల అంకితభావాన్ని చాటాయి.

ALSO READ  CM Chandrababu: నేర రాజకీయాలపై సీఎం చంద్రబాబు ఫైర్: ఏపీని నవశకంలోకి నడిపించేందుకు సంకల్పం

ఈ అంశాలపై గ్రౌండ్‌ లెవెల్‌ వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చే మహా ప్రయత్నం మహాన్యూస్‌ చేయబోతోంది. మంచిని మంచిగా, చెడుని చెడుగా ప్రజల ముందుంచబోతోంది. గౌరవనీయులైన ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి రాని అంశాలు పల్లెల్లో ఇంకా అనేకం ఉన్నాయి. వాటన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చి.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచే బృహత్తర బాధ్యతని మహాన్యూస్‌ తీసుకుంది. ‘గ్రామాలలో పవనిజం – పల్లె బాటలో మహా టీమ్‌‌’ పేరిట ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న మహా సంచలన డ్రైవ్‌లో ఎక్కడిక్కడ పాల్గొనాల్సిందిగా గ్రామస్తులు, గ్రామ పాలకులు, గ్రామాధికారులను సవినయంగా ఆహ్వానిస్తోంది మహాన్యూస్‌.

‘గ్రామాలలో పవనిజం – పల్లె బాటలో మహా టీమ్‌‌’ పేరిట ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న మహా సంచలన డ్రైవ్‌పై ప్రత్యేక కథనం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *