ED entry in liquor case

ED entry in liquor case: బిగ్‌ బాస్‌ని పట్టుకునేందుకు పకడ్భంధీగా ప్లాన్‌?

ED entry in liquor case: ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో గురువారం ఈడీ రైడ్స్‌ జరిగాయి. లిక్కర్‌ స్కామ్‌లో 3500 కోట్ల ముడుపులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్‌.. దర్యాప్తు ప్రారంభించి ఇప్పటి వరకూ 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. ఇప్పుడు నిందితులకు సంబంధించిన సంస్థలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిగాయి. మద్యం డిస్టలరీల ద్వారా పొందిన ముడుపుల సొమ్ము 3500 కోట్లను బినామీ కంపెనీలు, షెల్‌ కంపెనీలు, హవాలా మార్గాల ద్వారా మళ్లించినట్లు సిట్‌ ఆధారాలతో సహా గుర్తించింది. దీంతో మనీ ల్యాండరర్లు, మధ్యవర్తులే టార్గెట్‌గా ఈడీ ఈ సోదాలు చేస్తోంది. ఈ లిక్కర్‌ స్కామ్‌లో ఇన్వాల్వ్‌ అయిన డిస్టలరీల నుండి ఇప్పటికే వాంగ్మూలం నమోదు చేసిన ఈడీ.. ఏ1 నిందితుడు రాజ్‌ కసిరెడ్డి సైతం విచారించింది. ఇటీవల విశాఖ వేదికగా బీజేపీ సభ జరిగింది. ఆ సభకు విచ్చేసిన బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా… జగన్‌ మోహన్‌ రెడ్డి పరిపాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్‌ అవినీతిని ఆధారాలతో సహా బయట పెడతాంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారం తిరక్కుండానే ఈడీ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ప్రధాని మోడీతో ఏపీ మంత్రి నారా లోకేష్‌ భేటీ సందర్భంగా కూడా లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ ఎంట్రీపైనే ప్రధానంగా చర్చ జరిగింది. దీన్ని బట్టి చూస్తే… బిగ్‌ బాస్‌ని ఆధారాలతో సహా ఇరికించేలా కూటమి ప్రభుత్వం పకడ్భంధీగానే ప్లాన్‌ చేస్తున్నట్లు అర్థమౌతోందంటున్నారు పరిశీలకులు.

మరోవైపు 2 రోజుల పాటు సిట్ కస్టడీని ఎదుర్కోబోతున్నారు వైసీపీ ఎంపీ, లిక్కర్‌ స్కామ్‌ నిందితుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. లిక్కర్ సిండికేట్‌లో మిథున్ రెడ్డే కీలకంగా ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్ సత్య ప్రసాద్‌ను 2019 అక్టోబర్‌ 8న తిరుపతిలోని తన ఇంటికి పిలవడంతో లిక్కర్‌ సిండికేట్‌లో మిధున్‌ రెడ్డి రోల్‌ మొదలైంది. డి-కార్ట్ లాజిస్టిక్స్ నుంచి మిధున్‌రెడ్డికి సంబంధించిన పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్‌కు 5 కోట్లు వెళ్లింది. ఇది ముడుపుల డబ్బేనని సిట్‌ ఆధారాలు సేకరించింది. అసలు ముడుపుల వసూలు, తరలింపులో మిధున్ రెడ్డి పాత్ర కీలకం అంటోంది సిట్. దీంతో ఈ కేసులో ఈడీ కూడా మిధున్‌ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. మిధున్‌ రెడ్డితో పాటూ… చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డిలను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ కేసులో మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. డిఫాల్ట్‌ బెయిల్‌పై నలుగురు నిందితులు విడుదలైన సంగతి తెలిసిందే. వీరి నిందితుల డిఫాల్ట్‌ బెయిల్స్‌పై ఏసీబీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సిట్ సవాల్ చేసింది. వీరి డీఫాల్ట్‌ బెయిల్‌ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు జైలులో ఉన్న 8 మంది నిందితుల రిమాండ్‌ని కోర్టు పొడిగించింది.

Also Read: CM Chandrababu: దేశ ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ 2.0 ఒక గేమ్‌ఛేంజర్: సీఎం చంద్రబాబు

“ఆర్ధిక నేరాలు చాలా తీవ్రమైనవి. దేశ ఆర్ధిక వ్యవస్థపైనే ప్రభావం చూపే అవకాశం ఉంది.” ఇది చెప్పింది ఎవరో కాదు… ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్సెస్ సీబీఐ’ కేసులో సుప్రీం కోర్టు అభిప్రాయం ఇది. ఆర్ధిక నేరాల్లో మనీ లాండరింగ్, ఫ్రాడ్, ఇన్ సైడర్ ట్రేడింగ్, వీటి ద్వారా రాష్ట్రానికి న్యాయబద్దంగా రావలసిన ఆదాయానికి గండి కొట్టడం తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. ఇలాంటి నేరాలలో ఈడీ చర్యలు చాలా కఠినంగానూ ఉంటాయి. ఒక్కసారి ఈడీ ఎంటరైతే… ‘బర్డెన్‌ ఆఫ్‌ ఫ్రూఫ్‌’ అనే క్లాస్‌ అప్లై అవుతుంది. అంటే… తాము తప్పు చేయలేదని ఫ్రూవ్‌ చేసుకోవాల్సిన బాధ్యత కూడా నిందితుడిపైనే ఉంటుంది. సుప్రీం కోర్టు కూడా దీన్ని సమర్ధించింది. ఇక నిందితుల ఆస్తులను అటాచ్ చేసే అధికారం ఈడీకి ఉంటుంది. మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఏ ఆస్తినైనా అటాచ్ చేసే అధికారం, ఎవరినైనా సరే విచారణకు రావాల్సింది సమన్‌ చేసే అధికారం ఈడీ కలిగి ఉంది. సో… ఈడీ ఎంట్రీతో బిగ్‌ బాస్‌ వైపు లిక్కర్‌ కేసు మరింత వేగం పుంజుకుందని చెప్పవచ్చు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *