Currepted MRO Sambepalli: బర్త్ సర్టిఫికెట్ నుంచి డెత్ సర్టిఫికెట్ వరకు రెవిన్యూ కార్యాలయాలే వేదిక. అయితే రెవిన్యూలో లీలలు అంతా ఇంతా కాదు. అన్నమయ్య జిల్లా సంబేపల్లెలో ఆ ఎమ్మార్వో తిరే వేరు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా పలు చోట్ల కీలక పోస్టింగ్‌లు పొందారు ఆ ఎమ్మార్వో. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ ఆయన తన చేతివాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఎమ్మార్వో బాధితుడు ఒకరు బయటకొచ్చాడు. తనకు కోర్టు అనుమతులు ఉన్నప్పటికీ తన స్థలానికి పాస్ బుక్‌లు చేయించాలంటే ఎమ్మార్వో 20 లక్షలు డిమాండ్ చేసాడని ఆరోపించారు బాధితుడు పర్వత రెడ్డి. సంబేపల్లి ఎమ్మార్వోకు ఇప్పటికే 7 లక్షల నగదు ఇచ్చానని బాధితుడు చెబుతున్నాడు. ఎమ్మార్వో వేధింపులు, డిమాండ్లు ఆగకపోవడంతోనే బయటపెట్టాల్సి వచ్చిందంటున్నాడు బాధితుడు పర్వత రెడ్డి. దీంతో తప్పును కవర్ చేసుకునేందుకేమో తెలీదు కానీ.. బాధితుడికి మళ్ళీ కొంత డబ్బును ఫోన్ పే ద్వారా తిరిగి పంపిచడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: Nara Lokesh Golden Leg: ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. లోకేష్ ఇచ్చిపడేశాడు!
ఈ విషయంపై మహాన్యూస్ ఎమ్మార్వో వివరణ కోరగా… పట్టా పాస్ బుక్‌లు చేయించాలని పర్వత రెడ్డి తన ఆఫీస్ చుట్టూ నాలుగు నెలలుగా తిరుగుతున్నాడని, కోర్టు నామ్స్ ప్రకారం ఆ పని చేయడం కుదరదని చెప్పానని, దీంతో బలవంతంగా తన టేబుల్‌పై నగదు పెట్టి వెళ్లిపోయాడని, అందుకే అతనికి తిరిగి ఫోన్ పే ద్వారా డబ్బు తిరిగి చెల్లించామని స్వయంగా ఏమ్మార్వో సుబ్రహ్మణ్యం రెడ్డి చెబుతుండటం గమనార్హం. ఇంతకు ఏది ఏమైనా ఏమ్మార్వో డబ్బులు తీసుకున్నానని ఒప్పుకోవడమే ఇక్కడ కొసమెరుపు. గతంలోనూ సంబేపల్లి ఎమ్మార్వో సుబ్రహ్మణ్యం రెడ్డిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి ఫిర్యాదు చేశాడు సదరు బాధితుడు.

