Babu Warn Balayya: “నోరు జారే ఎమ్మెల్యేలను కంట్రోల్‌లో పెట్టండి. సభలో ఏం మాట్లాడాలో, బయటా ఏం మాట్లాడాలో ఎమ్మెల్యేలకు తెలీకుంటే ఎలా? సభ్యులు ఏం మాట్లాడుతున్నారో ఇంచార్జ్ మంత్రులు అసలు పట్టించుకోరా? అన్నింటినీ పర్యవేక్షించాలంటే నా ఒక్కడి వల్లా అవుతుందా? ఇక నుంచి నోటి తీట ఎమ్మెల్యేలను కంట్రోల్‌లో పెట్టాల్సిన బాధ్యత మీదే. మరోసారి రిపీట్ అయితే, సభలో ఏది పడితే అది మాట్లాడితే ఉపేక్షించేది లేదు” ఇవీ టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో ఇంచార్జ్ మంత్రులకు సీఎం ఇచ్చిన ఆదేశాలు. సీఎం ఆగ్రహానికి, తీసుకున్న నిర్ణయానికి, ఇంచార్జ్ మంత్రులకు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌కు వెనుక చాలా బలమైన కారణాలున్నాయంటున్నారు పరిశీలకులు.
ఇటీవల అసెంబ్లీలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ నోటి దురుసుతో ఇరకాటంలో పడింది టీడీపీ అధిష్టానం. జనసేన మంత్రి నాదెండ్లని ఇబ్బంది పెట్టారు మరో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. ఏకంగా హోం మంత్రినే టార్గెట్ చేశారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఇక విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యలతో మనస్థాపానికి గురయ్యారు డిప్యూటీ సీఎం పవన్. ఒకేసారి తనతోపాటు తన అన్నయ్య చిరంజీవిని, జనసేన మంత్రులు నాదెండ్ల, దుర్గేష్‌లను టీడీపీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేయడంతో పవన్ ఢీలా పడిపోయారు. తానేమో పొత్తు కోసం తపిస్తూ.. మరో 15 ఏళ్లు కలసి సాగాలని ఆకాంక్షిస్తుంటే… టీడీపీ ఎమ్మెల్యేలు హద్దు దాటుతుండటం పవన్‌ని బాధించింది. పవన్ జ్వరంతో బాధపడుతున్న సందర్భంలో ఆయన ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు.. పవన్‌కి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పవన్ తన ఆవేదన నుండి బయటకు రాలేకపోతున్నారని తెలుస్తోంది. దీంతో నోటి తీట ఎమ్మెల్యేలపై ఆగ్రహంగా ఉన్నారు సీఎం చంద్రబాబు.
Also Read: Chandrababu Naidu: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
ముఖ్యంగా వియ్యంకుడు బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన చంద్రబాబు.. ఎవర్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి అంటూ జిల్లాల ఇంచార్జ్ మంత్రులకు ఆదేశాలిచ్చారు. ఒక్కో జిల్లా ఇంచార్జ్ మంత్రి కింద ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు? ఎలాంటి అంశాలను లేవనెత్తుతున్నారో పర్యవేక్షించుకోవాలంటూ సూచించారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సీరియర్, జూనియర్ ఎమ్మెల్యేలకే కాదు… ముఖ్యంగా బాలయ్యకు కూడా వర్తిస్తాయని చెప్పుకోవాలి. బాలయ్య హిందూపురం ఎమ్మెల్యే మాత్రమే. ఆ రకంగానే ఆయన ప్రవర్తిస్తే బాగుంటుందని చంద్రబాబు చెప్పకనే చెప్పారని అనుకోవాలి ఉంటుంది. చూడాలి మరి.. చంద్రబాబు ఆదేశాలు ఏ మేరకు అమలవుతాయో.