Baahubali: బాహుబలి సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయి. ఈ చిత్రం గురించి ఓ డాక్యుమెంటరీ తెరకెక్కుతున్నట్లు అనుష్క శెట్టి వెల్లడించారు. ‘ఘాటి’ చిత్ర ప్రమోషన్స్‌లో ఆమె ఈ సంచలన విషయాన్ని పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీలో బాహుబలి తెరవెనుక జరిగిన ఆసక్తికర విషయాలు, నిర్మాణ ప్రక్రియ, తారల అనుభవాలు చోటు చేసుకోనున్నాయని సమాచారం. అనుష్క ఇప్పటికే తన భాగం షూటింగ్ పూర్తి చేశారు. దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, రానా, తమన్నా వంటి తారలు కూడా ఈ డాక్యుమెంటరీలో భాగం కావచ్చని అంచనా. ఈ డాక్యుమెంటరీ ఎక్కడ, ఎప్పుడు రిలీజ్ అవుతుందనే వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బాహుబలి అభిమానులకు ఈ డాక్యుమెంటరీ ఒక విజువల్ ట్రీట్‌గా నిలవనుంది.
