Azam khan: సమాజ్‌వాది పార్టీ (Samajwadi Party) సీనియర్ నేత, మాజీ ఎంపీ ఆజంఖాన్ (Azam Khan) మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. సుమారు 23 నెలల తర్వాత ఆయన జైలు బయటకు రావడంతో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
ఉదయం 9 గంటలకే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, లీగల్ ప్రక్రియలో ఆలస్యం కావడంతో కొంత సమయం తర్వాతే ఆయన జైలు బయటకు వచ్చారు. ఎట్టకేలకు బయటకు వచ్చిన ఆజంఖాన్‌ను పార్టీ కార్యకర్తలు హర్షధ్వానాలతో ఆహ్వానించారు.
80కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆజంఖాన్, గత 23 నెలలుగా జైలులోనే ఉన్నారు. గత సంవత్సరం మే నెలలో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు తాత్కాలిక భద్రత కల్పించింది. భూఆక్రమణ (Land Encroachment) కేసులో ఆజంఖాన్ అరెస్ట్ అయ్యిన విషయం తెలిసిందే.
అలాగే, ఆయన జస్వంత్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.