Jammu Kashmir: భారత ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని బట్టల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు భారత ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు.జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన 32 ఫీల్డ్ రెజిమెంట్ వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ చేసింది. కెర్రీలోని బట్టాల్ ప్రాంతంలోని అసన్ దేవాలయం సమీపంలో భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదుల ఉనికి గురించి గ్రామస్థులు సమాచారం అందించారని ఆర్మీ అధికారులు తెలిపారు.
ఆర్మీ అంబులెన్స్ అటుగా వెళుతుండగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. పోలీసులతో పాటు ఆర్మీ సిబ్బంది గ్రామం, పరిసర ప్రాంతాలను చుట్టుముట్టారు. ఇంకా సరిహద్దు దాటి చొరబడిన ఉగ్రవాదులను గుర్తించడానికి, వారిని అంతం చేయడానికి ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. భారత ఆర్మీ వాహనాలపై కనీసం ముగ్గురు ఉగ్రవాదులు 15-20 రౌండ్లు కాల్పులు జరిపారని సమాచారం. దీంతో అక్కడ హై అలర్ట్ కనిపిస్తుంది. అటు భారత జవాన్లు ఇటు పోలీసులు ఉగ్రవాదులు గురించి జల్లెడ పడుతున్నారు.

