Andhra Pradesh

Andhra Pradesh: తెనాలిలో దారుణం – కుటుంబ కలహాలతో వ్యక్తి హత్య

Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న వరుస హత్యలు మేడ్చల్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణంగా హత్య ఇది మరవకముందే ఏపీలో మరో దారుణం తెనాలిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య డొంక రోడ్డులో పండ్ల వ్యాపారం చేసే రబ్బానిపై కత్తితో దాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రబ్బాని మృతి హత్యకు కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్న పోలీసులు దంపతుల మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న గొడవలు రబ్బాని జోక్యం చేసుకోగా అతనిపై కక్ష పెంచుకున్న గౌస్ పట్టపగలే నడిరోడ్డుపై కత్తితో దాడి చేయడంతో తెనాలిలో కలకలం.

ఎవడి గొడవ…ఎవడికి సంబంధం. అసలు ఏది లేని దానికి అనవసర హత్య . అసలు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు. ఏది లేని దానికి ఎదో ఉంది అని అనవసరంగా ఆ పంచాయితీ లోకి దూరడం..ఆ తరువాత ..అసలు ఎందుకు ఇందులోకి వచ్చావ్ అని ..ఇంకొకడు కోపం పెంచుకోవడం. ఆ లొల్లిలో …చంపేయాలి అని డిసైడ్ అవ్వడం. ఫైనల్లీ చంపేశాడు.

తెలుగు రాష్ట్రాల్లో వరుస హత్యలు వణికించాయి. అందరు చూస్తుండగానే కత్తులతో దాడి చేసి ప్రాణాలు బలిగొన్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉమేష్ అనే వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జరిగి కొన్ని గంటలైనా గడువక ముందే ఏపీలో మరో దారుణం వెలుగుచూసింది. తెనాలిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. డొంక రోడ్డులో పండ్ల వ్యాపారం చేసే రబ్బాని పై గౌస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన రబ్బానిని తెనాలి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రబ్బాని మృతి చెందాడు.

ఇది కూడా చదవండి: OnePlus Watch 3: వన్‌ప్లస్ నుండి కొత్త వాచ్.. ధర తక్కువ ఫీచర్స్ ఎక్కువ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 16 రోజులు వస్తుంది..

అయితే రబ్బాని హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తెనాలి చినరావూరుకు చెందిన షేక్‌ రబ్బాని చెంచుపేట డొంక రోడ్డు వద్ద పండ్లు విక్రయిస్తుంటాడు. ఇతని మేనకోడలు కరీమాను పినపాడుకు చెందిన షేక్‌ గౌస్‌ బాజీ అలియాస్ బడే కి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఈ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాదు నుంచి కొంత మందిని తీసుకువచ్చిన గౌస్ బాజీ భార్యను కాపురానికి పంపించమని వారితో మాట్లాడించే ప్రయత్నం చేశాడు.

ఈ క్రమంలో రబ్బాని జోక్యం చేసుకోగా అతనిపై కక్ష పెంచుకున్నాడు గౌస్. రబ్బానీని అంతమొందించాలని నిర్ణయించుకుని ఆదివారం సాయంత్రం ఓ టీ స్టాల్ వద్ద టీ తాగుతున్న రబ్బానీపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. స్థానికులు అతన్ని తెనాలి లోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే రబ్బాని మృతి చెందాడు.

తెనాలి త్రీ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పట్టపగలే నడిరోడ్డుపై కత్తితో దాడి చేసి వ్యక్తిని హత్య చేయడం తెనాలిలో తీవ్ర కలకలం రేకెత్తించింది. తెలుగు రాష్ట్రాల్లో వరుస హత్యలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. మనుషులమన్న సంగతి మరిచి ఇలా చంపుతున్నారేంట్రా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *