Hyderabad: మని ముందు మంచి చెడు అనేది ఏమి ఉండదు. జస్ట్ మని మని అంతే…మని మ్యాటర్ లో …ఇక వేరే ఏ మ్యాటర్ ఉండదు. ఇదే మని కోసం అవసరం అయితే తన మన అనే తేడా కూడా లేకుండా ప్రాణాలు కూడా తీసేస్తుంటాము. అంత పవర్ ఈ మనికి. కరెన్సీ కట్టలను కనుక్కున్నది మనమే ..మనం కనుగున్న ఈ మని కోసం …మృగాలుగా కూడా మారిపోతాము.
వాళ్ల ఇద్దరు మంచి స్నేహితులు.. కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఇద్దరు కలిసి పరిష్కారించుకునేవారు..ఒకరు కార్ల వ్యాపారి..మరోకరూ స్విగ్గి బాయిగా పనిచేసేవాడు. ఇళ్ల కలిసిమెలిసి ఉండే ఇద్దరు మధ్య చిన్న గొడవ మొదలైంది.. అంతే, స్నేహితుల ఉన్న ఇద్దరు..శత్రువులుగా మారారు… ఇంతకీ ఇద్దరి మధ్య వచ్చిన గొడవ ఏంటి… ఎందుకు రక్తపు మడుగులు దాకా వెళ్లింది.
Hyderabad: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలత అరుణోదయ కాలనీలో నివసించే కాశిరావు ఒక కార్ల వ్యాపారి. అతను కారులు అమ్మడం,కొనడం అతని పని. ఇతనికి భార్య,ఇద్దరు పిల్లలు. అతనికి శేఖర్ అనే వ్యక్తి మంచి స్నేహితుడు. శేఖర్ స్విగ్గి బాయిగా పనిచేస్తున్నాడు. అయితే, అవసరం నిమిత్తం శేఖర్ కాశిరావు దగ్గర నాలుగు లక్షల రూపాయల అప్పును తీసుకున్నాడు. 4 లక్షలు తిరిగి ఇచ్చే నేపథ్యంలో వీరి మధ్య గొడవ జరిగింది.
గొడవ జరగడంతో స్నేహితులుగా ఉన్న ఇద్దరు శత్రువులుగా మారారు. గొడవలలో రెచ్చిపోయిన శేఖర్ అనే వ్యక్తి కాశీరావ్‌ను గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న కాశీరావును తన భార్య సుమతి చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Hyderabad: వీరి మధ్య డబ్బు విషయంలోనే గొడవ జరిగిందా..?లేక మరేదైన విషయంలో గొడవ జరిగిందా..? ఈ హత్యకు ఇంకా ఎవరైన సహకారం అందించారా.. అనే కోణంలో విచారణ జరుగుతుందని హయత్ నగర్ ఇన్స్పెక్టర్ నాగరాజు వివరాలు వివరించారు.

