Mohammed Siraj: క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్, ప్రముఖ గాయని ఆశా భోంస్లే మనవరాలు జనాయ్ భోంస్లే మధ్య గత కొన్ని నెలలుగా కొనసాగిన డేటింగ్ పుకార్లకు ఇటీవల చెక్ పడింది. ఆగస్టు 9న రాఖీ పండుగ సందర్భంగా, జనాయ్ సిరాజ్‌కు రాఖీ కట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనవరి 2025లో జనాయ్ భోంస్లే పుట్టినరోజు వేడుకల్లో సిరాజ్ పాల్గొన్నప్పుడు, వారిద్దరి మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. ఈ పుకార్లు రోజురోజుకూ పెరిగిపోయాయి. జనాయ్ భోంస్లే ఈ పుకార్లను పదేపదే ఖండించారు.
సిరాజ్ తనకు సోదరుడితో సమానమని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో స్పష్టం చేశారు. కానీ నెటిజన్ల నుంచి వచ్చే కామెంట్స్ మాత్రం ఆగలేదు. రాఖీ పండుగ రోజున జనాయ్ సిరాజ్‌కు రాఖీ కట్టిన వీడియోను పోస్ట్ చేసి, “నాకు ఇంతకంటే మంచి సోదరుడు దొరకలేడు” అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్‌తో వారి మధ్య ఉన్నది అన్నా-చెల్లెళ్ల బంధం మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ వీడియోకు సిరాజ్ కూడా కామెంట్లు డిసేబుల్ చేయడం గమనార్హం. ఈ రాఖీ వేడుకతో సిరాజ్, జనాయ్ ఇద్దరూ తమ మధ్య ఎలాంటి రొమాంటిక్ సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈ ఘటన తర్వాత నెటిజన్లు కూడా “మేము వదిన అనుకున్నాం, మీరు చెల్లి అయ్యారు” అంటూ సరదా కామెంట్లు పెడుతున్నారు.