Arya 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబో అంటే ఫ్యాన్స్‌కి పండగే. వీళ్లిద్దరి హిట్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య-2’ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. మ్యూజికల్ హిట్‌గా నిలిచి, అభిమానుల మనసుల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ సినిమా రీ-రిలీజ్‌తో మళ్లీ సందడి చేయడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ ఫుల్ స్వింగ్‌లో ఉండగా, ‘ఆర్య-2’ని ఏప్రిల్ 5న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
Also Read: Mega 157: వెంకీ బాటలో చిరు!
Arya 2: టికెట్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగానే సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చేస్తోంది. సంధ్య 35 ఎంఎం థియేటర్లో అయితే కేవలం 2 నిమిషాల్లోనే టికెట్లు సోల్డ్ ఔట్ అయిపోయాయట. ఈ సినిమా రీ-రిలీజ్‌కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే, బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ కొట్టడం పక్కా అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి, ఈ రీ-రిలీజ్‌తో అల్లు అర్జున్ మ్యాజిక్ ఎలా రిపీట్ అవుతుందో చూడాలి.
ఆర్య-2 – మై లవ్ ఈజ్ గాన్ వీడియో చూడండి :

