Arvind Kejriwal: ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం మోత మోగిస్తున్నాయి అన్ని పార్టీలు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంపై దారుణమైన ఆరోపణలు చేశారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా జలాలను విషపూరితం చేసిందని ఆయన ఆరోపించారు. హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల నుంచి ఢిల్లీ ప్రజలకు తాగునీరు అందుతుందని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ హర్యానా ప్రభుత్వం యమునా జలాన్ని విషపూరితం చేసింది. ఈ నీళ్లు తాగితే ఢిల్లీప్రజలు చనిపోతారు. దీనికి కారణం ఆప్ ప్రభుత్వం అని నింద వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాలు.
కేజ్రీవాల్ 3 ఆరోపణలు ఇవే..
ఇది బీజేపీ నీచమైన పని: భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకూ చరిత్రలో ఎవరూ చేయని ఇంత నీచమైన పని చేసింది. యమునా నదిలో అమ్మోనియా ఆనవాళ్లు మితిమీరి ఉన్నాయి. దీనిని ఢిల్లీ జల్ బోర్డు ఇంజనీర్లు పట్టుకున్నారు.
వాటర్ ట్రీట్మెంట్ వలన కూడా శుభ్రం కాలేదు: ఈ విషపూరితమైన నీరు చాలా ప్రమాదకరమైనది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ కూడా విషాన్ని శుభ్రం చేయలేకపోయింది.
ఢిల్లీలో నరమేధం జరిగి ఉండేది: ఈ నీళ్లు ఢిల్లీకి వచ్చి తాగునీళ్లలో కలిసి ఉంటే ఢిల్లీలో ఎంతమంది చనిపోతారో తెలియదు- మారణహోమం జరిగేది.
ఇది కూడా చదవండి: Modi- Trump: ట్రంప్ తో మాట్లాడిన మోదీ.. అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు!
ఇలాంటి తప్పుడు ప్రచారం ఆయనకు అలవాటే..
హర్యానా సీఎం నయాబ్ సైనీ ఈ ఆరోపణలపై మాట్లాడుతూ- ఆరోపణలు చేసి పారిపోవడం కేజ్రీవాల్ కు అలవాటు. మీరు మీ ప్రధాన కార్యదర్శిని పంపండి అలాగే, నాణ్యతను తనిఖీ చేయమని నేను నా ప్రధాన కార్యదర్శిని అడుగుతాను అని నేను చెప్పాను. ఆరోపణలు చేసే బదులు పని చేయాలి. ఢిల్లీ ప్రజలు ఆయనకు (కేజ్రీవాల్‌కు) గుణపాఠం చెబుతారని అన్నారు.
నివేదిక కోరిన ఎన్నికల సంఘం:
Arvind Kejriwal: ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు ఈ విషయమై చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం అందుకుంది. హర్యానా నుంచి ఢిల్లీకి సరఫరా అవుతున్న నీటిలో అమ్మోనియా పరిమాణం పెరిగిపోయిందనే ఆరోపణలు వచ్చాయి. జనవరి 28 మధ్యాహ్నం 12 గంటలలోపు వాస్తవ నివేదికను అందించాలని కమిషన్ హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఢిల్లీ జల్ బోర్డు సీఈఓ మాట్లాడుతూ – కేజ్రీవాల్ ప్రకటన తప్పు: కేజ్రీవాల్ వాదన తప్పు అని జల్ బోర్డు సీఈవో శిల్పా షిండే ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. హర్యానా కారణంగా యమునా నదిలో అమ్మోనియాకు సంబంధించి ఆనవాళ్లు పెరిగిపోయాయంటూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటనలో ఎలాంటి ఆధారం లేదని లేఖలో రాశారు. అందులో పేర్కొన్న వాస్తవాలు తప్పు అదేవిధంగా అందరినీ తప్పుదారి పట్టించేవి అని శిల్పా షిండే స్పష్టం చేశారు.