Arvind Kejriwal

Arvind Kejriwal: ఘనంగా కేజ్రీవాల్ కుమార్తె వివాహం.. ‘పుష్ప2’ పాటకు స్టెప్పులేసిన మాజీ సీఎం

Arvind Kejriwal: ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ఇంట పెళ్లి బృందావనంలా మారింది. ఆయన కుమార్తె హర్షిత కేజ్రీవాల్ వివాహం, ఐఐటీ ఢిల్లీ గ్రాడ్యుయేట్ అయిన సంభవ్ జైన్‌తో శుక్రవారం రాత్రి ఢిల్లీలోని కపుర్తలా హౌస్ వేదికగా అత్యంత ఘనంగా జరిగింది. రాజకీయ ప్రముఖులు, సన్నిహితులు, కొద్ది మంది సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు.

వివాహ వేడుకలో కేజ్రీవాల్ దంపతులు – అరవింద్ కేజ్రీవాల్, సునీత కేజ్రీవాల్ కలిసి ‘పుష్ప 2’ సినిమాలోని హిందీ వెర్షన్ “సూసేకీ” పాటకు స్టెప్పులేశారు. వీరి స్టెప్పులు ఎంతో ఎనర్జిటిక్‌గా ఉండటంతో, అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేశాయి. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అయితే, ప్రత్యేకంగా బాంగ్రా డ్యాన్స్‌తో వేడుకకు జోష్ నింపారు. ఈ డ్యాన్స్ వీడియోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: Sri Lanka: వావ్ శ్రీలంక! ఈ చర్యతో భారతదేశ హృదయాన్ని గెలుచుకున్నాడు

హర్షిత – సంభవ్ జంట మధ్య పరిచయం ఐఐటీ ఢిల్లీలో విద్యనభ్యసించే రోజుల్లో మొదలైంది. ఇద్దరూ కెమికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. విద్యనంతరం హర్షిత గురుగ్రామ్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో అసోసియేట్ కన్సల్టెంట్‌గా పని చేస్తుండగా, సంభవ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఇద్దరూ కలిసి “బసిల్ హెల్త్” అనే హెల్త్‌టెక్ స్టార్టప్‌ను ప్రారంభించారు.

Arvind Kejriwal: వివాహ వేడుక అనంతరం ఏప్రిల్ 20న ఏర్పాటు చేయనున్న గ్రాండ్ రిసెప్షన్‌కు పలువురు రాజకీయ నాయకులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశముంది.  వాట్సాప్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ దాకా కేజ్రీవాల్, భగవంత్ మాన్ డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. రాజకీయ రంగంలో ప్రధానంగా సీరియస్ ఇమేజ్‌లో కనిపించే నేతలు ఇలా కుటుంబ వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొనడం పట్ల నెటిజన్లు ప్రత్యేకంగా స్పందిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *