Sonu Sood: ప్రముఖ నటుడు, సోషల్ వారియర్ సోనూ సూద్‌కు పెద్ద షాక్ తగిలింది. తాజాగా ఆయనను అరెస్ట్ చేయాలనీ పంజాబ్, లుథియానా కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బ్లాక్ చైన్ ఇన్వెస్ట్‌మెంట్లో భాగంగా ఓ కేసులో ఆయన ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఒక ట్రాన్సిక్షన్ లో సాక్షిగా ఉన్నా సోనూ సూద్ ఆ కేసు విచారణలో హాజరు కావాల్సి ఉండగా కోర్టు ఆదేశాలను పట్టించుకోలేనట్లు సమాచారం. దీంతో తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.
మోసం కేసులో ప్రముఖ నటుడు సోను సూద్ పై పంజాబ్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. లూథియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా, మోహిత్ శుక్లాపై రూ. 10 లక్షల మోసం కేసు దాఖలు చేశారు. ఇందులో, పెట్టుబడిని ప్రేరేపించినందుకు నటుడు సోను సూద్‌పై కూడా కేసు నమోదైంది. సంబంధిత కేసులో స్వయంగా హాజరు కావాలని నటుడు సోను సూద్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. కానీ, అతను స్పందించలేదు.
ఇది కూడా చదవండి: Maha Kumbhamela 2025: మహా కుంభమేళాకు 68 మంది పాకిస్తాన్ యాత్రీకులు
ప్రస్తుతం ఇండస్ట్రీలో సోనూ సూద్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకు ఏమైందంటే.. లుథియానాకు చెందిన అడ్వకెట్ రాజేశ్ ఖన్నా.. మోహిత్ శర్మ అనే వ్యక్తిని రిజికా కాయిన్ ఇన్వెస్ట్‌మెంట్లో రూ. 10 లక్షలు మోసం చేశాడు. దీనికి సోనూ సూద్ సాక్షిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే మోహిత్ శర్మ పంజాబ్, లుథియానా కోర్టులో కేసు వేయగా విచారణ నేపథ్యంలో సోనూ సూద్ ను కోర్టుకు హాజరు కావాలని సమన్లు పంపించింది. పలుమార్లు కోర్టు సమన్లు జారీ చేసిన ఆయన భేఖాతరు చేయడంతో లుథియానా కోర్టు ఆగ్రహించింది. తాజాగా ముంబై, అందేరి వెస్ట్‌లోని ఒషివారా పోలీస్ స్టేషన్‌కు లుథియానా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ సోనూసూద్‌ను అరెస్ట్ చేసి వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ ఉత్తర్వులను పాటించకపోతే ఉల్లంఘన చట్టం కింద కఠిన చర్యలు తప్పవని వారెంట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. కాగా, ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.
ఈ పరిస్థితిలో, కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు నటుడు సోను సూద్‌పై లూథియానా జిల్లా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ అరెస్ట్ వారెంట్‌పై చర్య తీసుకోవాలని ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్‌ను కూడా కోర్టు ఆదేశించింది.