Arjun Erigaisi: దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న భారత చెస్‌లో వరంగల్ కుర్రాడు అర్జున్ ఇరిగేశి అరుదైన ఘనతను సాధించాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత 2800 లైవ్ రేటింగ్ పాయింట్లకు చేరుకున్న రెండో భారతీయుడిగా అతడు నిలిచాడు..
తెలుగుతేజం, గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి యూరోపియన్ క్లబ్ చెస్ టోర్నీలో గురువారం అయిదో రౌండ్లో అద్భుతం చేశాడు. ఆంద్రీకిన్ మిత్రిపై గెలుపుతో ఈ మైలురాయిని చేరుకున్నాడు. లైవ్ రేటింగ్స్ లో అతడు ప్రస్తుతం 2802.1 పాయింట్లతో ఉన్నాడు. చెస్ చరిత్రలో అర్జున్ కన్నా ముందు మరో 15 మంది మాత్రమే 2800 రేటింగ్ పాయింట్లు సాధించారు.
Arjun Erigaisi: 21 ఏళ్ల అర్జున్ ఈ టోర్నీలో అల్కలాయిడ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న అర్జున్.. భారత్ ఇటీవల చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. 2011 మార్చిలో విషీ అత్యధికంగా 2817 రేటింగ్‌ను అందుకున్నాడు.