Today Gold Price: దేశంలో పసిడి ధరలు మరోసారి పెరుగుతూ మదుపర్లను ఆశ్చర్యానికి గురిచేశాయి. గత కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు గురువారం తిరిగి పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశ రాజధానిలో ఒక్కరోజే రూ.200 పెరిగి ₹99,400కి చేరుకుంది. ఇదే సమయంలో 99.5 నాణ్యత గల బంగారం ధర కూడా ₹200 పెరిగి ₹98,900గా నమోదైంది.
బంగారం ధరల పెరుగుదలకి ప్రధాన కారణంగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యం ఉంది. ఇటీవల అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ చేసిన హెచ్చరికల ప్రకారం, ఈ వాణిజ్య ఉద్రిక్తతలు ఇంకా ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాక, ట్రంప్ మరోసారి చైనాపై సుంకాలు విధించబోతున్నట్టు సంకేతాలు ఇవ్వడంతో బంగారానికి గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ప్రపంచంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం ఎప్పుడూ రాజకీయ, ఆర్థిక అనిశ్చితి సమయంలో డిమాండ్‌లోకి వస్తుంది.
వెండి ధరలు కూడా పెరుగుదల వైపు
వెండి ధరలు కూడా ఈ ట్రెండ్‌ను అనుసరిస్తున్నాయి. కిలో వెండి రూ.700 పెరిగి ₹99,900కు చేరుకుంది. బంగారంతో పాటు వెండిలోనూ మదుపులు పెరగడం వెనుక కారణాలు కూడా అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలే.
గత వారంలో బంగారం ధరలు ₹1 లక్ష మించగా, లాభాల బుకింగ్‌తో ధరలు ఒక దశలో రూ.2400 వరకూ తగ్గాయి. అయితే, నిపుణుల అంచనాల ప్రకారం ఇది తాత్కాలికమేనని, బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నారు.
Also Read: Hyderabad: వేసవిలో హైదరాబాద్ నుండి AC రైలు టిక్కెట్లకు అధిక డిమాండ్
హైదరాబాద్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?
హైదరాబాద్ నగరంలో కూడా బంగారం ధరలు తగ్గినా తిరిగి పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి:
22 క్యారెట్ల బంగారం – తులం ధర ₹90,050
24 క్యారెట్ల బంగారం – 10 గ్రాములకు ₹98,240
ఇవి రెండు ధరలు గత రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గినా, గతంలో ఒక్కరోజే రూ.2,750 వరకు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి.
ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జేపీ మోర్గాన్ అంచనా ప్రకారం, ఈ ఏడాది చివరకు బంగారం ధర ఔన్స్‌కు $4000 వరకూ చేరే అవకాశముందని అంచనా వేసింది. ఆర్థిక ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధాలు, కేంద్ర బ్యాంకుల బలహీనతలు బంగారం ధరలను చారిత్రాత్మక గరిష్ఠాల వైపు తీసుకెళ్లే సూచనలు ఉన్నాయి.