AP Rains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ తాజా అలెర్ట్ ఇచ్చింది. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు ఈరోజు కూడా కంటిన్యూ అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య, వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. అయితే, అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ శాఖ చెబుతోంది. కానీ, రాబోయే 24 గంటల్లో దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అలాగే గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
AP Rains ఇదిలా ఉంటే ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా మంగళవారం అనకాపల్లిలో 13 సెంటీమీటర్ల వర్షం నమోదు అయింది. ఇక ఈ ప్రభావం గురువారం(సెప్టెంబర్ 26) కూడా కొనసాగే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, కోనసీమ ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా , గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ చెబుతున్న దాని ప్రకారం ఈ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: ఏపీకి మళ్ళీ అల్పపీడన దెబ్బ.. వర్షాలు అప్పుడే ఆగకపోవచ్చు