AP News: రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మిగతా ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆదివారం (ఆగస్టు 3) నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ మేరకు రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు తెలిపారు.
