AP News: కల్లుగీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి వార్తను అందించింది. బార్ల టెండర్లలో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇప్పటికే మద్యం దుకాణాల టెండర్లలో కల్లు గీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నరాష్ట్ర ప్రభుత్వం.. తాజగా బార్ల లైసెన్సుల కేటాయింపుల్లో కూడా 10 శాతం కల్లు గీత కార్మికులకే కేటాయించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు.
AP News: సెప్లెంబర్ 1 నుంచి రాష్ట్రంలో నూతన బార్ పాలసీని అమలు చేయనున్నట్టు సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దానిలో భాగంగా క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా బార్ పాలసీ తేనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని 3,736 మద్యం దుకాణాల్లో 10 శాతం అంటే 340 దుకాణాలను గీత కార్మిక వృత్తిలో ఉన్న కుటుంబాలకే కేటాయించారు.
AP News: ప్రస్తుతం ఏపీలో నూతన పాలసీ ప్రకారం.. 840 బార్లు, 50 స్టార్ హోటళ్లు, మైక్రో బ్రూవరీల లాంటి సంస్థలకు లైసెన్సులు ఉన్నాయి. అలాగే 44 బార్ లైసెన్సుల గడువు ముగిసినా ఇంకా రెన్యువల్ కాలేదు. నూతన పాలసీ అమలు కోసం ఇప్పటికే ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కేరళ బార్ లైసెన్స్ విధానాలపై సబ్ కమిటీ అధ్యయనం చేస్తున్నది.
AP News: 840 బార్లను 1,000కి పెంచాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నది. కల్లు గీత కార్మికులకు కేటాయించే బార్లకు లైసెన్స్ ఫీజును తక్కువగా ఉండేలా కమిటీ రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రంలోని వైన్స్ డీలర్లు, స్టార్ హోటళ్ల అసోసియేషన్లు, హోటల్ యాజమానుల సమాఖ్యల నుంచి వచ్చిన వినతలను సబ్ కమిటీ పరిశీలంచనున్నది.

