AP News:

AP News: మ‌హాశివ‌రాత్రి వేడుక‌ల్లో అప‌శృతి.. గోదావ‌రిలో ఐదుగురు యువ‌కుల గల్లంతు

AP News: తూర్పుగోదావ‌రి జిల్లాలో విషాదం చోటుచేసుకున్న‌ది. మ‌హాశివ‌రాత్రి వేడుక‌ల సంద‌ర్భంగా అప‌శృతి చోటుచేసుకున్న‌ది. ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని గోదావ‌రిలో పుణ్యస్నానాలు ఆచ‌రించేందుకు వెళ్లిన ఐదుగురు యువ‌కులు గ‌ల్లంత‌య్యారు. వారిలో ఒక‌రి మృత‌దేహం ల‌భించ‌గా, మిగ‌తా వారి ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

AP News: తూర్పుగోదావ‌రి జిల్లా తాళ్ల‌పూడి మండ‌లం తారిపూడి వ‌ద్ద గోదావ‌రిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. యువ‌కులు గ‌ల్లంతైన విష‌యం తెలిసిన స్థానిక పోలీసులు అక్క‌డికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు. గ‌ల్లంతైన యువ‌కుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ చ‌ర్య‌లు ఇంకా కొన‌సాగుతున్నాయి. మిగ‌తా న‌లుగురి కోసం ముమ్మ‌రంగా గాలిస్తున్నారు.

మృతులు వీరే

గ‌ల్లంతైన వారు తాటిపూడి వ‌ద్ద తారిపూరికి చెందిన వారిగా గుర్తించారు. వారు ప‌వ‌న్, దుర్గాప్ర‌సాద్‌, అనిశెట్టి ప‌వ‌న్‌, ఆకాశ్‌, సాయిగా గుర్తించారు. చేతికొచ్చిన సంతానం గోదావ‌రిలో గ‌ల్లంత‌వ‌డంతో వారి కుటుంబాల‌న్నీ దుఃఖ‌సాగ‌రంలో మునిగిపోయాయి. తారిపూరి గ్రామంలో విషాదం అలుముకుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *