Nara Lokesh

Nara Lokesh: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకొస్తాం

Nara Lokesh: నేపాల్‌లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల మధ్య చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నేడు అనంతపురంలో జరగాల్సిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్ని రద్దు చేసి, మొత్తం దృష్టినీ బాధితుల రక్షణపై కేంద్రీకరించారు.

ఆర్టీజీఎస్ సెంటర్‌లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు

సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (RTGS) లో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక వార్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. మంత్రి లోకేశ్ సంబంధిత శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రతి రెండు గంటలకు బాధితుల పరిస్థితిపై అప్‌డేట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కాఠ్‌మాండూ నుంచి ప్రత్యేక విమానం

ప్రాథమిక సమాచారం ప్రకారం, నేపాల్‌లోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో 215 మంది తెలుగు ప్రజలు చిక్కుకున్నట్లు అధికారికంగా గుర్తించారు.

  • గౌశాలలో 90 మంది

  • పశుపతి నగరంలో 55 మంది

  • బఫాల్‌లో 27 మంది

  • సిమిల్‌కోట్‌లో 12 మంది

ఇతర ప్రాంతాల్లో కూడా కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. కాఠ్‌మాండూ నుంచి విశాఖపట్నంకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి బాధితులను సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు ఆదేశాలు జారీ చేశారు.

వీడియో కాల్‌లో భరోసా

చిక్కుకున్న బాధితులతో మంత్రి నారా లోకేశ్ స్వయంగా వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి చిక్కుకున్న సూర్యప్రభ, రోజారాణి వంటి మహిళలతో మాట్లాడి పరిస్థితులను ఆరా తీశారు. “మీ భద్రత మా ప్రాధాన్యం. ప్రతి రెండు గంటలకు మీతో సంప్రదింపులు చేస్తాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే సురక్షితంగా రాష్ట్రానికి రప్పిస్తాం” అని భరోసా ఇచ్చారు.

హెల్ప్‌లైన్ నంబర్లు

నేపాల్‌లో చిక్కుకున్న వారికోసం భారత రాయబార కార్యాలయం (కాఠ్‌మాండూ) మరియు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచాయి:

📞 భారత రాయబార కార్యాలయం (కాఠ్‌మాండూ):
+977-9808602881 / +977-9810326134 (వాట్సాప్‌లో కూడా అందుబాటులో)

📞 ఏపీ భవన్ (న్యూ ఢిల్లీ):
+91 9818395787

📞 APNRTS 24/7 హెల్ప్‌లైన్:
0863 2340678 | WhatsApp: +91 8500027678
✉️ Email: helpline@apnrts.cominfo@apnrts.com

కేంద్ర ప్రభుత్వ సహకారంతో రక్షణ చర్యలు

నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీ వాస్తవతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, కేంద్ర ఏజెన్సీల సహకారంతో తెలుగు ప్రజల రక్షణ చర్యలు వేగవంతం చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Short News: డిప్యూటీ సీఎం పవన్‌ కామెంట్స్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *