Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. దరఖాస్తు ప్రక్రియ మే 15తో ముగిసింది. అధికారికంగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్నాయి.
అయితే అభ్యర్థులు చాలామంది 90 రోజుల గడువు కోరుతూ ప్రభుత్వాన్ని వినతి చేస్తున్నారు. తమకు తగినంత ప్రిపరేషన్ టైం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, సోషల్ మీడియాలోనూ ప్రభుత్వ దృష్టిని ఆకర్షిస్తున్నారు.
మంత్రుల స్థాయిలో స్పందన – స్పష్టత ఇచ్చిన నారా లోకేశ్
ఈ అంశంపై తాజాగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “డీఎస్సీని ఆపేందుకు వైసీపీ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అభ్యర్థులు సమయం కావాలని అంటున్నారు కానీ, గత ఏడాది డిసెంబరులోనే మేము సిలబస్ విడుదల చేశాం. అంటే ఇప్పటికే ఏకంగా 7 నెలల గడువు ఇచ్చినట్లే” అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Tim Cook: యాపిల్ సీఈవో టిమ్ కుక్ కీలక ప్రకటన.. ట్రంప్ వ్యాఖ్యలపై స్పందన
ఈ వ్యాఖ్యలతో డీఎస్సీ గడువు పొడిగింపు అంశానికి తుది క్లారిటీ వచ్చినట్టయింది. తద్వారా, పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరగనున్నట్టు స్పష్టమైంది.
2025 ఏపీ మెగా డీఎస్సీ పూర్తి షెడ్యూల్
-
దరఖాస్తులు & ఫీజు చెల్లింపు: ఏప్రిల్ 20 – మే 15
-
మాక్ టెస్టులు ప్రారంభం: మే 20 నుంచి
-
హాల్ టికెట్ల డౌన్‌లోడ్: మే 30 నుంచి
-
ఆన్‌లైన్ పరీక్షలు: జూన్ 6 – జులై 6
-
ప్రాథమిక కీ విడుదల: పరీక్షల అనంతరం రెండో రోజే
-
అభ్యంతరాల స్వీకరణ: 7 రోజుల పాటు
-
తుది కీ విడుదల: అభ్యంతరాల గడువు ముగిసిన 7 రోజుల్లో
-
మెరిట్ జాబితా విడుదల: తుది కీ విడుదలైన 7 రోజులకు
అభ్యర్థులకు ముఖ్య సూచన
ఈ దఫా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది బంగారు అవకాశం. గడువు పెంపు ఆశలు వీడి, ఇప్పటికైనా పూర్తిస్థాయిలో ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టాలి. సిలబస్ ఇప్పటికే చాలా కాలం క్రితమే విడుదల కాగా, ఇప్పుడు మరింత సమయాన్ని కోల్పోకుండా మాక్ టెస్టులు, ప్రాక్టీస్ పరీక్షలు ద్వారా ప్రిపరేషన్‌ను పటిష్టం చేసుకోవాలి.