Tim Cook: భారత్‌లో యాపిల్ తయారీ వద్దు.. అమెరికాయే ముద్దు.. అంటూ ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరాడు. ఇటీవల జరిగిన వారిద్దరి భేటీలో ఈ అంశం ప్రధాన ప్రస్తావనకు వచ్చింది. భారత్‌లో టారిఫ్‌లు అధికంగా ఉన్నాయని, అందుకే ఆ దేశంలో అమెరికా ఉత్పత్తులను అమ్మడం చాలా కష్టమని చెప్పాడు.
Tim Cook: దీంతో ఒక్కసారిగా భారత్, అమెరికా వాణిజ్య అంశాలపై చర్చోపచర్చలు మొదలయ్యాయి. గత కొన్నాళ్లుగా భారత్‌కు ట్రంప్ వైఖరి కంటగింపుగా మారింది. ఈ దశలోనే టిమ్‌కుక్‌తో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ దశలోనే టిమ్ కుక్ స్పందించారు. యాపిల్ భారత్‌ను వదిలి వెళ్లడం లేదని టిమ్ కుక్ తేల్చి చెప్పారు. ఐఫోన్ల తయారీని భారత్‌లో పెంచుతామని స్పష్టం చేశారు.
Tim Cook: యాపిల్ కంపెనీ ఐఫోన్ 17 సిరీస్‌ను భారత్‌లోనే తయారీ చేపడుతామని కంపెనీ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. ఐ ఫోన్ ప్రొ మోడళ్లను కూడా ఇక్కడే తయారీ చేస్తామని, దీనికోసం టాటా ఎలక్ట్రానిక్స్ ముందుకొచ్చిందని చెప్పారు. ఐ ఫోన్ 17 సిరీస్ తయారీని భారత్‌లోని ఫాక్స్ కాన్ కంపెనీ మొదలు పెట్టిందని వివరించారు. దీంతో భారత్ వాణిజ్యం ఊపిరి పీల్చుకున్నది. భారత్, పాక్ ఉద్రిక్తతల నాటి నుంచి ట్రంప్ ధోరణిపై భారతీయుల్లో రగిలిపోతున్నారు.