AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులను ఇచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయనకు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత సెప్టెంబర్ 11వ తేదీన తిరిగి సరెండర్ కావాలని కోర్టు ఆదేశాలను జారీ చేసింది.
AP Liquor Scam: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్‌పై సెప్టెంబర్ 4న వాదోపవాదాలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరఫున జేడీ రాజేంద్రప్రసాద్ వాదించారు. మిథున్‌రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాల్సిన అవసరం లేదని, ఇప్పటికే అమృతపాల్‌సింగ్ కేసులో పోస్టల్ బ్యాలెట్ వినియోగించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించిందని, దీనినే మిథున్‌రెడ్డికి కూడా వర్తింపజేయాలని ఆయన వాదించారు.
AP Liquor Scam: మిథున్‌రెడ్డి తరఫున నిరంజన్‌రెడ్డి వాదించారు. బెయిల్ ఇస్తే కేసుపై ప్రభావం పడబోదని, ఓటు వేయడమే లక్ష్యంగా ఈ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. దీంతో ఇరుపక్షాల వాదనలు పూర్తికాగా, న్యాయమూర్తి భాస్కరరావు తీర్పును సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, ఇదివరకు పలుమార్లు బెయిల్ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది.