AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తున్న మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీని మైసూరులో సిట్ అధికారులు అరెస్టు చేశారు. పూర్తి సమాచారం సేకరించిన తర్వాత బాలాజీని అదుపులోకి తీసుకుని, ట్రాన్సిట్ వారెంట్‌తో విజయవాడకు తరలిస్తున్నారు.
భారతీ సిమెంట్స్ సంస్థలో డైరెక్టర్‌గా కొనసాగుతున్న బాలాజీ గోవిందప్ప, మాజీ ముఖ్యమంత్రి జగన్ సన్నిహితుడిగా చెబుతున్నారు. మద్యం సరఫరా కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసి, డొల్ల కంపెనీలకు ఆ డబ్బును మళ్లించడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్టు సిట్ విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు మాజీ సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డిపై కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Crime News: పసికందు ప్రాణం తీసిన తల్లీకూతుళ్లు.. తల్లితో కలిసి కన్నకూతురు ఉసురుతీసిన మహిళ
ఇప్పటికే వీరికి నోటీసులు జారీ చేసినా విచారణకు హాజరుకాలేదు. హైకోర్టు ముందస్తు బెయిల్‌ను కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా మధ్యంతర రక్షణను ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే బాలాజీని అరెస్టు చేశారు.
ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులు అరెస్ట్ చేశారు. సిట్ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, మద్యం డీలింగ్‌లపై నిర్ణయాలు తీసుకునే సమావేశాలు తరచూ హైదరాబాద్, తాడేపల్లిలో నిర్వహించేవారని, వారిలో బాలాజీతో పాటు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలు కూడా పాల్గొనేవారని వివరాలు వెల్లడి అయ్యాయి. ఇదే అంశాన్ని ఇటీవల అరెస్టైన నిందితుల రిమాండ్ రిపోర్టుల్లో కూడా ప్రస్తావించారు. బాలాజీ అరెస్టుతో కేసు మరింత వేగం పుంజుకోనుందని భావిస్తున్నారు. మరిన్ని అరెస్టులు, విచారణలు జరగే అవకాశముంది.