AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (ఏ-4) ఏ క్షణమైనా అరెస్టు అవ్వచ్చని సమాచారం.
కోర్టుల నుంచి షాక్ – SIT అరెస్ట్‌కు సిద్ధం
హైకోర్టు, సుప్రీంకోర్టులు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయడంతో SIT అధికారులు అరెస్ట్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో SIT అధికారులు మెమో వేశారు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల పూర్తి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించడంతో SIT ఆ వివరాలు సమర్పించింది.
ప్రస్తుతం మిథున్ రెడ్డి ఎక్కడ ఉన్నారో SIT ప్రత్యేక బృందాలు వెతుకుతున్నాయి. విదేశాలకు పారిపోకుండా SIT ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేసింది.
విచారణకు హాజరయ్యే అవకాశం
మిథున్ రెడ్డి శనివారం మధ్యాహ్నం SIT ఎదుట విచారణకు హాజరై లొంగిపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్టు సమాచారం. SIT ఎదుట హాజరైతే నోటీసులు ఇచ్చి వెంటనే అరెస్ట్ చేసే అవకాశముంది.
ఇది కూడా చదవండి: Pakistan: భారత విమానాలకు గగనతల నిషేధం పొడిగింపు.. ఎప్పటివరకంటే..!
లిక్కర్ స్కామ్ వెనుక మిథున్ రెడ్డి పాత్ర
సుమారు ₹3,500 కోట్ల లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని SIT చెబుతోంది. డిస్టిలరీల నుంచి లిక్కర్ ఆర్డర్లు తీసుకోవడం నుంచి ముడుపులు వసూలు చేయడం వరకు అన్ని విషయాల్లో మిథున్ రెడ్డే ప్రధానంగా వ్యవహరించారని ఆరోపిస్తోంది. వైసీపీ పాలనలో లిక్కర్ పాలసీ అమలు మొత్తం మిథున్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిందని SIT హైకోర్టుకు, ఏసీబీ కోర్టుకు నివేదించింది. ఇప్పటికే SIT 11 మందిని అరెస్ట్ చేసి, 220 మందిని విచారించి కీలక ఆధారాలు సేకరించింది.
మాజీ మంత్రి నారాయణ స్వామికి SIT నోటీసులు
ఈ కేసులో మరో కీలక పరిణామంగా మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామికి SIT నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు SIT కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన నారాయణ స్వామి జీడి నెల్లూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు.

