AP EAPCET 2025 Results: ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2025 ఫలితాలను ఆదివారం జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTU) కాకినాడ అధికారికంగా విడుదల చేసింది. మే 19 నుంచి 27 మధ్య నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3,40,300 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 75.67గా నమోదైంది. ఫలితాలు https://cets.apsche.ap.gov.in/EAPCET వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇంజినీరింగ్ విభాగంలో టాప్‌ర్స్:
ఈ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్ రెడ్డి మొదటి ర్యాంకుతో ముందంజలో ఉన్నాడు. శ్రీకాళహస్తికి చెందిన భానుచరణ్ రెడ్డి రెండో ర్యాంకు, పాలకొల్లు విద్యార్థి యశ్వంత్ మూడో ర్యాంకు, నంద్యాల జిల్లా రామ్ చరణ్ రెడ్డి నాలుగో ర్యాంకు, భూపతి నిఖిల్ అగ్ని హోత్రి ఐదో ర్యాంకు సాధించారు.
అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగంలో టాప్‌ర్స్:
పెనమలూరుకు చెందిన సాయి హర్షవర్ధన్ అగ్రి, ఫార్మసీ విభాగంలో మొదటి ర్యాంకు దక్కించుకున్నారు. కోనసీమకు చెందిన మల్లేశ్ కుమార్ మూడో ర్యాంకు, హనుమకొండ విద్యార్థి షణ్ముఖ్ నాలుగో ర్యాంకు, కాకినాడకు చెందిన సత్య వెంకట్ ఐదో ర్యాంకు సాధించారు. అనంతరంగా గోవర్థన్ (6వ), లక్ష్మి చరణ్ (7వ), కిరీటి (8వ), మోహిత్ శ్రీ రామ్ (9వ), సూర్య చరణ్ (10వ) స్థానాల్లో నిలిచారు.
ఈఏపీసెట్ విజయవంతంగా నిర్వహించిన జేఎన్టీయూ వీసీ, పరీక్షా ప్రాధికారులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఫలితాల ప్రకటనతో నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్‌కు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.
తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు