Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం బాగుజోల గ్రామంలో పర్యటించారు. అక్కడ పవన్ కళ్యాణ్ బాగుజోలలో నూతన రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. జనాలు పడుతున్న బాధలు తెలుసుకోవడనికి పవన్ కళ్యాణ్ బురదలో నడుచుకుంటూ వెళ్లారు. అదే సమయంలో పక్కనే ఉన్న అభిమానులు OG OG అంటూ అరవడం మొదలు పెట్టారు.
దింతో కళ్యాణ్ నన్ను పని చేసుకోనివ్వండి.. నేను బయటికొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను OG OG అని అరిస్తే పనులు జరగవు.. సీఎం సీఎం అంటారు, డిప్యూటీ సీఎం అయ్యాను కదా సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు. మాట్లాడితే మీసం తిప్పు, మీసం తిప్పు అంటారు.. నేను మీసం తిప్పితేనో, ఛాతిలు కొట్టుకుంటేనో పనులు జరగవు అని అభిమాలులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.