Chandrababu: సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత హైకమీషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీలో పెట్టుబడుల అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు, సాంకేతిక రంగంలో భాగస్వామ్యంపై విస్తృతంగా చర్చించారు.
ఏపీలో పెట్టుబడులకు ప్రత్యేక అవకాశాలు
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిఫెన్స్, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సింగపూర్ కంపెనీల కోసం ప్రోగ్రెసివ్ పాలసీలు అమల్లో ఉన్నాయని చెప్పారు. సింగపూర్‌లో సీబీఎన్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని భారత హైకమీషనర్ శిల్పక్ అంబులే ప్రశంసించారు.
అమరావతి, గ్రీన్ ఎనర్జీ, కొత్త ప్రాజెక్టులు
గతంలో సింగపూర్‌తో కలిసి అమరావతి ప్రాజెక్టు చేపట్టినా, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని సీఎం గుర్తు చేశారు. ఇప్పుడు ఆ అపోహలను తొలగించి, పెట్టుబడులపై విశ్వాసాన్ని పెంచేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: PR Team: పీఆర్ ఏజెన్సీ వల్లే సినిమా ఆఫర్లు రావడం లేదు.. ?
ఏపీలో గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని వివరించారు. ఇండియా క్వాంటం మిషన్‌లో భాగంగా అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
రాయలసీమ, ఐటీ, విద్య రంగాల్లో దృష్టి
రాయలసీమ ప్రాంతం డిఫెన్స్, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు అనువుగా ఉందని సీఎం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ టెక్ నిపుణులకు సింగపూర్, ఆగ్నేయాసియాలో మంచి డిమాండ్ ఉందని హైకమీషనర్ వివరించారు.
విద్యా రంగంలో ప్రముఖ సంస్థలను ఏపీలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారా లోకేష్ వివరించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ఏర్పాటుకు ఏపీ సిద్ధంగా ఉందని తెలిపారు.
ఏపి గేట్ వేగా – పెట్టుబడుల హబ్
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “సింగపూర్ నుంచి భారత్‌కు వచ్చే పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా (ప్రధాన ద్వారం) అవుతుంది” అని స్పష్టం చేశారు. సింగపూర్ ప్రభుత్వ సహకారం అవసరమని కోరారు.
Hon’ble Chief Minister Shri N. Chandrababu Naidu Garu met with Dr. Shilpak Ambule, High Commissioner of India to Singapore.@ncbn @HCI_Singapore pic.twitter.com/0Q4DBh6b62
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 27, 2025