ap cabinet

AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు..

AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. బుధవారం జరిగిన ఈ కేబినెట్ సమావేశం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఆర్‌డీఏ పరిధి 8,352 చదరపు కిలో మీటర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ లాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ ప్రొహిబిషన్‌-2024కు గ్రీన్‌సిగ్నల్‌. పంచాయతీ, గ్రామీణ అభివృద్ధిశాఖలో 2014 నుంచి 2018 మధ్య..పెండింగ్‌ పనుల బిల్లుల చెల్లింపునకు కేబినెట్‌ ఆమోదం. ఏపీ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ సవరణ బిల్లు-2024కు ఆమోదం.పిఠాపురం ఏరియా డెలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌. ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం. ఏపీ ఎక్సైజ్‌ చట్ట సవరణ ముసాయిదాను ఆమోదించిన కేబినెట్‌. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులతో పాటు, రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి పాల్గొన్నారు.

డ్రోన్‌ పాలసీకి క్యాబినెట్‌ ఆమోదం
డేటా సెంటర్‌ పాలసీ 4.Oకు ఆమోదం
సెమీ కండక్టర్‌ పాలసీకి క్యాబినెట్‌ ఆమోదం
ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌-1982 రద్దు
కొత్త చట్టానికి ఏపీ క్యాబినెట్‌ ఆమోదం
భూమి కబ్జా చేస్తే 10 నుంచి 14ఏళ్లు శిక్ష
కాంట్రాక్టర్ల బిల్లుల విడుదలకు క్యాబినెట్‌ ఆమోదం ‌
ఫ్యాబ్‌ 4.O పాలసీకి ఆమోదం
జ్యుడీషియల్‌ అధికారుల పదవీ కాలం 61కి పెంపు
ఏపీ GST సవరణ చట్టానికి ఆమోదం
అమరావతి చుట్టూ ORR కోసం CRDA పరిధి పెంపు

ఇది కూడా చదవండి: KTR: కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *